రిటైర్మెంట్‌పై క్రిస్ గేల్ స్పందన

రిటైర్మెంట్‌పై క్రిస్ గేల్ స్పందన
x
Highlights

విధ్వంకర క్రికెటర్ అనగానే టక్కున గుర్తొచ్చే ఒకే ఒక్కరి పేరు కరేబియన్ వీరుడు క్రిస్ గేల్. తన ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... క్రిజ్‌లో నిలిచాడంటే బంతి స్టేడియం అవతల ఉంటుంది. అయితే గత కొద్దిరోజుల నుండి భారత్‌లో వన్డే సిరీస్ అనంతరం గేల్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా వార్తలు వినిపించాయి.

విధ్వంకర క్రికెటర్ అనగానే టక్కున గుర్తొచ్చే ఒకే ఒక్కరి పేరు కరేబియన్ వీరుడు క్రిస్ గేల్. తన ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... క్రిజ్‌లో నిలిచాడంటే బంతి స్టేడియం అవతల ఉంటుంది. అయితే గత కొద్దిరోజుల నుండి భారత్‌లో వన్డే సిరీస్ అనంతరం గేల్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్‌పై స్పందించాడు. తాను ఇంకా రిటైర్మెంట్‌ ప్రకటించలేదంటూ స్పష్టం చేశాడు. తన రిటైర్మెంట్‌కు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదని, అవన్నీ ఉత్త పుకార్లు మాత్రమేనని కొట్టిపరేసారు. తాను ఇప్పటికీ జట్టులోనే కొనసాగుతున్నానని వెల్లడించాడు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన ఆఖరి వన్డేలో గేల్ ఓ రేంజ్ లో చెలరేగాడు. సిక్సర్లతో భారత బౌలర్లపై చేలరేగాడు. 41 బంతుల్లో 72 పరుగులు సాధించిన గేల్ ఎట్టకేలకు ఖలీల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే సరిగ్గా గేల్ ఔట్ అయిన వెంటనే భారత ఆటగాళ్లంతా అతనిని అభినందించడం.. మైదానాన్ని వీడుతూ అతను హెల్మెట్లో బ్యాట్ ను పెట్టి పైకెత్తి అభిమానులకు అభివందనం చేశాడు. ఇక దీంతో గేల్ రిటైర్మెంట్ చెప్పడం ఖాయమని ఫీక్స్ అయ్యారు అందరూ. కాని మ్యాచ్ ముగిసిన అనంతరం గేల్ తన రిటైర్మెంట్ పై మాట్లాడుతూ.. రిటైర్మెంట్ గురించి తాను ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories