హైదరాబాద్ ఆటోవాలా కూతురు.. జాతీయ టెన్నిస్ ఛాంపియన్!

హైదరాబాద్ ఆటోవాలా కూతురు.. జాతీయ టెన్నిస్ ఛాంపియన్!
x
Highlights

చేరాలనుకున్న లక్ష్యం వైపు విజయవంతంగా అడుగులు వేయాలంటే గట్టి సంకల్పం వుండాలి. సంకల్పం గట్టిదైతే లక్ష్యం చిన్నదవుతుంది. ఆ దారిలో పేదరికం అనే అడ్డంకి...

చేరాలనుకున్న లక్ష్యం వైపు విజయవంతంగా అడుగులు వేయాలంటే గట్టి సంకల్పం వుండాలి. సంకల్పం గట్టిదైతే లక్ష్యం చిన్నదవుతుంది. ఆ దారిలో పేదరికం అనే అడ్డంకి కూడా సంకల్పబలానికి దాసోహం అవుతుంది. సరిగ్గా అదే జరిగింది వర్ధమాన టెన్నిస్ తార తానియా విషయంలో..

టెన్నిస్ లో తానియా ఉత్సాహానికి తన కష్టంతో ఊపిరులూదాడు తండ్రి సామ్సన్. నడిపేది ఆటో అయినా తన చిన్నారికి ఇష్టమైన ఆటలో తర్ఫీదు ఇప్పించాలనుకున్నాడు. ఆ నిర్ణయమే ఇప్పుడు తానియాను చాపియన్ గా నిలబెట్టింది.

అండర్‌-12 బాలికల సింగిల్స్‌ ఛాంపియన్!

అది..ముంబయిలోని మహారాష్ట్ర లాన్‌ టెన్నిస్‌ సంఘం సెంటర్‌ కోర్టు. అండర్‌-12 బాలికల సింగిల్స్‌ ఫైనల్ మ్యాచ్. ఇద్దరు సమవుజ్జీలు.. స్నేహితుల మధ్య సమరం. ఎంతో ఉత్కంతగా సాగిన ఆ మ్యాచ్ లో టాప్‌ సీడ్‌ తానియా 6-2, 6-7 (4-7), 6-3తో నైనికారెడ్డి (మహారాష్ట్ర)పై విజయం సాధించి చాంపియన్ గా నిలిచింది 11 ఏళ్ల తానియా. ఇక్కడ ఇంకో విశేషమూ ఉంది. తానియా, నైనికా రెడ్డి తో కల్సి ఇదే టోర్నిలో డబుల్స్ లో 7-5, 7-6 (7-0)తో దివ్య- ఆకృతి జంటపై గెలిచింది. అంటే తానియా కిది డబుల్ బొనంజా విజయం.

తండ్రి కష్టమే పునాదిగా..

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన శాంసన్‌ బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. ఆటో అద్దెకు తీసుకుని జీవనం సాగించేవారు. తమ కూతురు తానియా కు టెన్నిస్ లో వున్న ఇష్టం చూసి.. తలకు మించిన భారం అయినా, 2016 ఆగస్టులో నేరెడ్‌మెట్‌లోని న్నిస్‌ అకాడమీలో నెలకు రెండు వేల రూపాయల ఫీజు చెల్లించి టెన్నిస్‌లో చేర్పించాడు. అక్కడ కోచ్ రవీందర్‌సింగ్‌ ఇచ్చిన శిక్షణతో మెరుగైన ఆటతీరును నేర్చుకుని తన ప్రతిభ ను ప్రదర్శించింది. అక్కడ నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రతి టోర్నీలో గెలుస్తూ పదేళ్లకే తెలంగాణ అండర్‌-12 నంబర్‌వన్‌గా నిలిచింది.

సానియా మిర్జా అకాడమీ.. ఉపాసన ప్రోత్సాహం..

2018 మే నెలలో సానియా అకాడమీలో ఐటా ఛాంపియన్‌షిప్‌ సిరీస్‌లో తానియా ప్రదర్శన చూసిన సానియా మీర్జా తల్లి నసీమా మీర్జా 2018 మే నెలలో ఆమెకు స్పాన్సర్‌షిప్‌ ప్రకటించారు. ప్రతి టోర్నీకి తండ్రితో కలిసి తానియా ఆటోలో రావడం.. విజేతగా నిలిచి వెళ్తుండటం గమనించిన ఆమె , హీరో రాంచరణ్ భార్య ఉపాసనతో కలిసి తానియా రాకెట్‌, షూ, దుస్తులు, శిక్షణ, టోర్నీలకు అయ్యే ఖర్చుల్ని భరిస్తామని తెలిపారు. దీంతో తానియాకు మరింత ప్రోత్సాహం దక్కింది. ఇప్పుడు డబుల్ చాంపియన్ గా నిలిచింది.

ఈ చిన్నారి తానియా విజయం వెనుక ఆమె తండ్రి కష్టం ఎంతో ఉంది. ఉదయం పూట అకాడమీ లో పని చెస్తూ.. రాత్రుళ్ళు అద్దె ఆటో నడుపుతూ తానియాను చాంపియన్ గా నిలబెట్టిన సాంసన్ ఆదర్శప్రాయుడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories