టీ20 కెప్టెన్ రేసు నుంచి హార్దిక్ పాండ్యాను అందుకే తప్పించాం? చీఫ్ సెలక్టర్ షాకింగ్ కామెంట్స్..

Hardik Pandya Not Considered For Team India T20I Captaincy For his fitness says Ajit Agarkar
x

టీ20 కెప్టెన్ రేసు నుంచి హార్దిక్ పాండ్యాను అందుకే తప్పించాం? చీఫ్ సెలక్టర్ షాకింగ్ కామెంట్స్..

Highlights

Ajit Agarkar Press Conference: సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తాడు. దీని తర్వాత కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి.

Team India: శ్రీలంక పర్యటనకు వెళ్లే ముందు టీ20, వన్డే జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు రోహిత్ శర్మను సారథిగా నియమించారు. ఈ క్రమంలో నేడు తొలి సారి మీడియా ముందుకు వచ్చిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక విషయాలను వెల్లడించారు. అలాగే, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వారి ప్రకారం, హార్దిక్ పాండ్యాను పట్టించుకోకుండా సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టుకు కెప్టెన్‌గా చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ అతనికి శాపంగా మారిందని తెలిపారు. కాగా, శ్రీలంక పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.

హార్దిక్ పాండ్యా కార్డు ఎందుకు కట్ చేశారు?

అజిత్ అగార్కర్ మాట్లాడుతూ, 'ఫిట్‌నెస్ ఒక స్పష్టమైన సవాలు. ఎక్కువ సమయం అందుబాటులో ఉండే ఆటగాడిని మేం కోరుకుంటున్నాం. సూర్య అత్యుత్తమ T20 బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. కెప్టెన్‌గా అన్ని మ్యాచ్‌లలో ఆడే అవకాశం ఉంది. అతను కెప్టెన్‌గా ఉండటానికి అర్హుడని మేం భావిస్తున్నాం" అంటూ చెప్పుకొచ్చాడు.

స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. 'హార్దిక్ లాంటి ప్రతిభను పొందడం కష్టమే, ఫిట్‌నెస్ సాధించడం కూడా కష్టమే. మాకు మరికొంత సమయం ఉంది. మేం కొన్ని విషయాలను పరిశీలించవచ్చు. ఫిట్‌నెస్ ఒక స్పష్టమైన సవాలు. మేం ఎక్కువ సమయం అందుబాటులో ఉండే ఆటగాడిని కోరుకున్నాం. మేం డ్రెస్సింగ్ రూమ్ నుంచి సాధారణ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నాం' అంటూ చెప్పుకొచ్చాడు.

వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. దీని తర్వాత కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల నుంచి రిటైరైన రోహిత్ శర్మ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories