Harbhajan Singh on China new Virus: కరోనాతో సతమతమవుతుంటే.. మరో వైరస్ సిద్దం చేస్తారా? హర్భజన్ సింగ్ ఫైర్

Harbhajan Singh on China new Virus: కరోనాతో సతమతమవుతుంటే..  మరో వైరస్ సిద్దం చేస్తారా? హర్భజన్ సింగ్ ఫైర్
x
Highlights

Harbhajan Singh on China new Virus: చైనా శాస్త్రవేత్తలు పందుల్లో స్వైన్ ఫ్లూ వంటి మరో రకం వైరస్‌ను గుర్తించారని తెలిపిన రాయిటర్స్ కథనాన్ని భ‌జ్జీ...

Harbhajan Singh on China new Virus: చైనా శాస్త్రవేత్తలు పందుల్లో స్వైన్ ఫ్లూ వంటి మరో రకం వైరస్‌ను గుర్తించారని తెలిపిన రాయిటర్స్ కథనాన్ని భ‌జ్జీ రీట్వీట్ చేశారు. ఇప్పుడు క‌రోనాతో చ‌స్తుంటే.. మ‌రొ వైర‌స్ సృష్టిస్తారా? అని డ్రాగన్ కంట్రీపై ధ్వజమెత్తాడు. 'యావత్ ప్రపంచం కరోనాతో ఏగలేక సతమతమవుతుంటే.. మరో వైరస్ సిద్దం చేశారు'కర్మరా బాబు అనే ఎమోజీలతో ట్వీట్ చేశాడు.

చైనా ప్రపంచంపై ఆధిపత్యం ఈ బయోవార్‌కు తెరలేపిందని చాలా మంది భావిస్తున్నారు. ఇక మ‌రో ఇండియాన్ క్రికెటర్ సురేశ్ రైనా కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు చూస్తుంటే చైనా కుట్రే అనిపిస్తుందని రైనా తెలిపాడు. చైనాలో ఎలా అదుపులోకి వచ్చిందని, ఇది పక్కా డ్రాగన్ కంట్రీ సృష్టించిందేనని చాలా మంది నెటిజన్లు అనుమానాం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పందుల్లో గుర్తించిన స్వైన్ ప్లూ తరహా వైరస్ గుర్తించినట్లు చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. పందుల్లో జీ4గా గుర్తింపు పొందిన ఈ వైరస్ హెచ్1ఎన్1 నుంచి సంక్రమించినట్లు ప్రాథమికంగా చైనా శాస్త్రవేత్తలు నిర్దారించారు. చైనాలో 10 ప్రావిన్స్‌ల్లో గల పందుల వధ శాలల నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించగా ఈ వైరస్ జాడ తేలినట్లు తెలిపారు. ప్రస్తుతానికి తమ దేశంలోని పందుల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని, ఇది మనుషులకు అవలీలగా సంక్రమించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీపీ) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories