Harbhajan Singh: ధోని టీమ్‌కు గుడ్ బై చెప్పిన హర్భజన్ సింగ్

Harbhajan Singh confirms CSK exit
x

Harbhajan Singh confirms CSK exit 

Highlights

ఇండియాన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ చైన్సె సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు టర్బొనేటర్ హర్భజన్ సింగ్ గుడ్ బై చెప్పేశాడు.

ఇండియాన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ చైన్సె సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు టర్బొనేటర్ హర్భజన్ సింగ్ గుడ్ బై చెప్పేశాడు. ఈ సారి ఐపీఎల్ సీజన్ 14 బజ్జీ ఆ జట్టు తరపున అందుబాటులో ఉండడు. ఈ విషయాన్ని భజ్జీనే స్వాయంగా వెల్లడించాడు. ఇక, ఆ టీమ్ తో తన బంధం ముగిసిందని పేర్కొన్నాడు. బుధవారం ట్విట్టర్ లో చెన్నైతో తన ఒప్పందం పూర్తయిపోయిందని వెల్లడించాడు.

చెన్నైటీమింతో నా ఒప్పందం పూర్తయింది. ఆ జట్టుకు ఆడడం గొప్ప అనుభవం. ఎన్నెన్నో అందమైన జ్ఞాపకాలను నా సొంతం చేసుకున్నా. ఎన్నోఏళ్ల పాటు గుర్తుంచుకునే గొప్ప స్నేహితులను చెన్నై టీం అందించింది. రెండేళ్ల పాటు నాకు అండగా నిలిచిన సీఎస్ కే యాజమాన్యానికి, సిబ్బందికి, అభిమానులకు ధన్యవాదాలు'' అని భజ్జీ ట్వీట్ చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2018 నుంచి 2020 వరకు చెన్నై తరఫున భజ్జీ బరిలోకి దిగాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, 2018 వేలంలో హర్భజన్ ను సీఎస్ కే దక్కించుకుంది. రూ.2 కోట్లకు అతడితో ఒప్పందం చేసుకుంది. మొత్తంగా 160 మ్యాచ్ లు ఆడిన భజ్జీ.. 150 వికెట్లు తీశాడు. 7.05 సగటుతో బౌలింగ్ చేశాడు. 137.22 స్ట్రైక్ రేట్ తో 829 పరుగులు చేశాడు. టీమిండియాకు భజ్జీ ఎన్నో సేవలు అందించాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories