బాయ్‌ఫ్రెండ్‌కు దూరంగా ఉండలేకపోతున్నా

బాయ్‌ఫ్రెండ్‌కు దూరంగా ఉండలేకపోతున్నా
x
gutta jwala, vishnu vishal
Highlights

క‌రోనా వైరస్‌ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్‌డౌన్ ప్రకటించిన విష‌యం తెలిసిందే.

క‌రోనా వైరస్‌ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్‌డౌన్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ విధించడంతో రాకపోకలు స్తంభిచిపోయాయి. దీంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. దూర ప్రాంతాల్లో ఉన్న కొందరు అత్మీయులకు, బంధువులకు దూరంగా చిక్కుకుపోయారు.

ఈ క్రమంలోనే ప్రముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణిబ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి, సినీనటి గుత్తా జ్వాలా త‌న బాయ్ ప్రెండ్ విష్ణు విశాల్‌ను మిస్ అవుతున్నా అంటూ స్వ‌యంగా ట్విట‌ర్ ద్వారా వెల్లడిచారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గుత్తా జ్వాలా హైద‌రాబాద్‌లోని తన నివాసంలో వుంటున్నారు.దీంతో గుత్తా జ్వాలా తన ప్రియుడు విష్ణు విశాల్‌ను దూరం అవుతున్న‌ట్లు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో మిస్ యూ..అంటూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై స్పందించిన‌ విష్ణు విశాల్ స్పందించారు. ప్ర‌స్తుతం పరిస్ధితుల్లో సామాజిక దూరం( సోషల్ డిస్టెన్స్) ముఖ్యం అంటూ జ్వాలాను కూల్ చేశారు.

కాగా ప్రముఖ బ్యాడ్మింటన్‌ గుత్తా జ్వాల, త‌మిళ న‌టుడు విష్ణు విశాల్ తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్ద‌రికి సంబంధించిన ఫోటోలు గ‌తంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా.. ఆ ఫోటోల్లో విష్ణు విశాల్, గుత్తా జ్వాల‌కు ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఇందులో ఉండ‌టం విశేషం. దీంతో వీరిద్ద‌రూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు క్లారిటీ వచ్చింది.

మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నడు మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయారు. ఇక‌ తమిళ హీరో విష్ణు విశాల్ తన భార్య రజనీతో గతేడాది జూన్‌లో విడిపోయారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories