MI Vs GT: ముంబై ఇండియ‌న్స్‌పై గుజ‌రాత్ టైటాన్స్ ఘ‌న విజ‌యం

Gujarat Titans Beat Mumbai Indians By 6 Runs
x

MI Vs GT: ముంబై ఇండియ‌న్స్‌పై గుజ‌రాత్ టైటాన్స్ ఘ‌న విజ‌యం

Highlights

MI Vs GT: హోంగ్రౌండ్‌లో శుభమన్ గిల్ జట్టుదే పైచేయి

MI Vs GT: అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు జయకేతనం ఎగురవేసింది. ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ముంబై కెప్టన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జట్టు ధాటిగా ఇన్నింగ్స్ ఆరింభించినప్పటికీ... ఆశించినంతగా పరుగులు రాబట్టలేకపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు సాధించింది. గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్ 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టన్ శుభ్‌మన్ గిల్ 31 పరుగులు, రాహుల్ తెవాటియా 22 పరుగులు, వృద్దిమాన్ సాహా19 పరుగులు నమోదు చేశారు. అజ్మతుల్లా ఒమర్ జాయ్ 17 పరుగులు డేవిడ్ మిల్లర్ 12 పరుగులకే పెవీలియన్ బాట పట్టాడు.

169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఆరంభంలోనే స్టార్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ ఎలాంటి పరుగులు నమోదు చేయకుండానే గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఆతర్వాత క్రీజులో కుదురుకున్న రోహిత్ శర్మతో కలిసి నమన్ ధీర్ ఆటను గాడిలో పెట్టి పరుగులు రాబట్టారు. డెవాల్డ్ బ్రేవిస్ 46 పరుగులతో ముంబై జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రోహిత్ శర్మ అర్థశతకానికి చేరువయ్యే క్రమంలో 43 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తిలక్ వర్మ 25 పరుగులు, నమన్ ధీర్ 20 పరుగులు అందించారు. రోహిత్ శర్మ ఔటైన తర్వాత, లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో వికెట్ల పతనం మొదలైంది. దీంతో పరాజయాన్ని నమోదుచేసి, పాత ఆనవాయితీని మూటగట్టుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories