Asia Cup 2023: శ్రీలంకపై భారత్‌ ఘన విజయం

Great Victory For India Against Sri Lanka
x

Asia Cup 2023: శ్రీలంకపై భారత్‌ ఘన విజయం

Highlights

Asia Cup 2023: అద్బుత గణాంకాలు నమోదు చేసిన భారత్ బౌలర్ కులదీప్ యాదవ్

Asia Cup 2023: ఆసియాకప్ సూపర్ ఫోర్స్ లో టీమిండియా అద్భుతాన్ని ఆవిష్కరించింది. కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. సూపర్ ఫోర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్ బెర్తుకు అర్హత సాధించింది. ఈనెల 14 తేదీన జరిగే ఆసియా కప్ పోటీల్లో ఫైనల్ బెర్తుకోసం శ్రీలంక, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో భారత జట్టు ఈనెల 17 తేదీ ఫైనల్లో తలపడుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ భారత జట్టు 49 ఓవర్ల ఓ బంతికి 213 పరుగులు చేసింది. 214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 41 ఓవర్ల మూడు బంతులకే ఆలౌట్ అయింది. దీంతో 41 పరుగుల తేడాతో భారత విజయాన్ని కైవసం చేసుకుంది.

భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. 350 పరుగు దాటే విధంగా ఉన్న రన్ రేట్ 80 పరుగుల వద్ద తొలివికెట్ కోల్పోయిన తర్వాత వెంటవెంటనే టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ53 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లోకేశ్ రాహుల్ 39 పరుగులు, ఇషాన్ కిషన్ 33 పరుగులు, అక్షర్ పటేల్ 26 పరుగులు, శుభమన్ గిల్ 19 పరుగులు అందించారు. మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

శ్రీలంక బౌలర్లు భారత్ దూకుడుకు కళ్లెం వేశారు. దీంతో భారత జట్టు 213 పరుగులకు పరిమితమైంది. దునిత్ వెల్లలగే 5 వికెట్లతో రికార్డు నమోదు చేశాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌తో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలగేను ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. అలాగే మరో శ్రీలంక బౌలర్ చరిత్ అసలంక నాలుగు వికెట్లను పడగొట్టి భారతజట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు.

214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకిదిగిన శ్రీలంక బ్యాట్స్ మెన్లు వెంట వెంటనే పెవీలియన్ బాట పట్టారు. 99 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడింది. ధనుంజయ డిసిల్వా, దునిత్ వెల్లలగే ఇద్దరూ బ్యాటింగ్‌తో విజయానికి బాటలు వేసే క్రమంలో భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన బంతిని సంధించి ప్రమాదకర బ్యాట్స్ మెన్ ధనుంజయ డిసిల్వాను బోల్తా కొట్టించి, పెవీలియన్ బాట పట్టించాడు.

దీంతో విజయానికి చేరువైన శ్రీలంక ఆశలపై నీలినీడలు కమ్ముకున్నాయి. స్వల్ఫ వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో శ్రీలంక 172 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories