Cricket Records: 9 దేశాలపై టెస్ట్ సెంచరీలు బాదిన డేంజరస్ ప్లేయర్లు.. లిస్టులో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు

from sachin tendulkar to rahul dravid these players to hit test centuries aginst 9 countries check full list
x

Cricket Records: 9 దేశాలపై టెస్ట్ సెంచరీలు బాదిన డేంజరస్ ప్లేయర్లు.. లిస్టులో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు

Highlights

క్రికెట్ ప్రపంచం నుంచి ఇప్పటివరకు కేవలం 14 మంది బ్యాట్స్‌మెన్స్ మాత్రమే టెస్టు మ్యాచ్‌ల్లో 9 దేశాలపై సెంచరీలు సాధించగలిగారు.

Test Cricket Records: క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన ప్లేయర్లు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అయితే టీ20, వన్డేలతో పోలిస్తే టెస్టు క్రికెట్‌లో సెంచరీ సాధించిన ఆనందమే వేరు. 9 విభిన్న దేశాలపై సెంచరీలు చేసి అద్వితీయ రికార్డు సృష్టించిన దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ జాబితాలో భారత్‌కు చెందిన ఇద్దరు క్రికెటర్లు కూడా ఉన్నారు.

క్రికెట్ ప్రపంచం నుంచి ఇప్పటివరకు కేవలం 14 మంది బ్యాట్స్‌మెన్స్ మాత్రమే టెస్టు మ్యాచ్‌ల్లో 9 దేశాలపై సెంచరీలు సాధించగలిగారు. ఈ జాబితాలో శ్రీలంక నుంచి నలుగురు, భారతదేశం నుంచి ఇద్దరు, ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు, వెస్టిండీస్ నుంచి ఒకరు, న్యూజిలాండ్ నుంచి ఒకరు, పాకిస్తాన్ నుంచి ఒకరు ఉన్నారు.

ఈ జాబితాలో ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్న ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ఇందులో మొదటి పేరు శ్రీలంక అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ ఏంజెలో మాథ్యూస్ కాగా, రెండో పేరు న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు 9 దేశాలతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో సెంచరీలు సాధించారు.

వెస్టిండీస్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా, శ్రీలంక గ్రేట్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర, ఆస్ట్రేలియా గ్రేట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు దక్షిణాఫ్రికా వెటరన్ ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ వా, రికీ పాంటింగ్, పాకిస్థాన్‌కు చెందిన యూనిస్ ఖాన్ కూడా 9 దేశాలపై టెస్టు మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించారు.

9 దేశాలపై టెస్టు సెంచరీలు చేసిన ఇద్దరు దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ కూడా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ పేరిట 51 టెస్ట్ సెంచరీలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్‌కైనా అత్యధికమనే సంగతి తెలిసిందే. అదే సమయంలో, ద్రవిడ్ తన టెస్ట్ కెరీర్‌లో 36 సెంచరీలు చేశాడు.

సచిన్ టెండూల్కర్ టెస్టు సెంచరీలు సాధించిన 9 దేశాల్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. అదే సమయంలో, రాహుల్ ద్రవిడ్ కూడా ఈ 9 దేశాలపై టెస్టు సెంచరీలు సాధించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories