Asia Cup 2023: ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఏకంగా 3 రికార్డులను బద్దలు కొట్టిన హిట్‌మ్యాన్..!

From Most Sixes to Highest Opening Partnership these 3 Records Rohit Sharma breaks India vs Nepal in Asia cup 2023
x

Asia Cup 2023: ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఏకంగా 3 రికార్డులను బద్దలు కొట్టిన హిట్‌మ్యాన్..!

Highlights

Rohit Sharma Records: ఆసియా కప్-2023లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో డీఎల్‌ఎస్‌ కింద టీమిండియా 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్ కూడా సూపర్-4 రౌండ్లోకి ప్రవేశించింది.

Rohit Sharma Records, Asia Cup 2023: ఆసియా కప్-2023లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో డీఎల్‌ఎస్‌ కింద టీమిండియా 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్ కూడా సూపర్-4 రౌండ్లోకి ప్రవేశించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో, కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ కూడా రికార్డ్ బుక్‌లో తన పేరును లిఖించుకున్నాడు.

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా రోహిత్..

ఆసియా కప్‌లో భారత జట్టు సూపర్-4 రౌండ్‌లోకి ప్రవేశించింది. వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా.. పల్లెకల్‌లో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో డీఎల్‌ఎస్ కింద నేపాల్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. 59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 74 పరుగులు చేసిన రోహిత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అలాగే శుభ్‌మన్ గిల్‌తో కలిసి 147 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. శుభ్‌మన్ గిల్ 67 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు. 62 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు.

ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు..

స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆసియా కప్ ODI ఫార్మాట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్లబ్‌లో చేరాడు. డాషింగ్ వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనాలను సమం చేశాడు. కరాచీలో (2008) పాకిస్థాన్‌పై సెహ్వాగ్ ఒక ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు కొట్టగా, రైనా హాంకాంగ్‌పై కరాచీలో (2008) ఒక ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) కరాచీలోనే ఒక ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు కొట్టిన రికార్డును సాధించాడు. ఈ జాబితాలో వెటరన్ సౌరవ్ గంగూలీ (బంగ్లాదేశ్‌పై, ఢాకా 2000) అగ్రస్థానంలో ఉన్నాడు. అతని పేరిట 7 సిక్సర్లు ఉన్నాయి.

భాగస్వామ్య పరంగా..

ఆసియా కప్ (ODI ఫార్మాట్)లో భారత్‌కు అతిపెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యం పరంగా, రోహిత్, శుభ్‌మన్ గిల్‌తో కలిసి మాజీ గ్రేట్స్ వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌ల రికార్డును వదిలిపెట్టాడు. 2008లో కరాచీలో హాంకాంగ్‌పై సెహ్వాగ్, గంభీర్ 127 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2018లో దుబాయ్‌లో పాకిస్థాన్‌పై శిఖర్ ధావన్‌తో కలిసి 210 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రోహిత్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. గ్రేట్ సచిన్ టెండూల్కర్, మనోజ్ ప్రభాకర్ 1995లో షార్జాలో శ్రీలంకపై మొదటి వికెట్‌కు 161 పరుగులు జోడించారు. ఇది ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది.

వన్డేల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం..

భారత్‌కు 10 వికెట్ల విజయంలో, రోహిత్, గిల్ వన్డే ఫార్మాట్‌లో అతిపెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కూడా నమోదు చేశారు. 2009లో హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ 201 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని పంచుకోవడం ద్వారా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. 1998లో షార్జాలో జింబాబ్వేపై అజేయంగా 197 పరుగుల భాగస్వామ్యంతో సచిన్, సౌరవ్ గంగూలీల జోడీ రెండో స్థానంలో ఉంది. 2022లో హరారేలో జింబాబ్వేపై శిఖర్ ధావన్, శుభ్‌మాన్ గిల్ అజేయంగా 192 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఇది జాబితాలో మూడవ స్థానంలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories