IND vs ZIM: తుఫాన్‌ ఎఫెక్ట్.. టీమిండియా స్వ్కాడ్‌లో కీలక మార్పు.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన ముగ్గురు.. ఎవరంటే?

IND vs ZIM: తుఫాన్‌ ఎఫెక్ట్.. టీమిండియా స్వ్కాడ్‌లో కీలక మార్పు.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన ముగ్గురు.. ఎవరంటే?
x
Highlights

టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత భారత క్రికెట్‌ జట్టు వెస్టిండీస్‌లోనే ఇరుక్కుపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఆటగాళ్లు జూన్ 29 నుంచి బార్బడోస్‌లోని ఒక హోటల్‌లో చిక్కుకున్నారు.

India vs Zimbabwe: టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత భారత క్రికెట్‌ జట్టు వెస్టిండీస్‌లోనే ఇరుక్కుపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఆటగాళ్లు జూన్ 29 నుంచి బార్బడోస్‌లోని ఒక హోటల్‌లో చిక్కుకున్నారు. తుఫాన్ కారణంగా ఆటగాళ్లు కనీసం హోటల్ రూంనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అయితే, ఈ క్రమంలోనే భారత రెండవ జట్టును జింబాబ్వే టూర్‌కి పంపాల్సి వచ్చింది. కాగా, ఈ జట్టులోకి సెలెక్ట్ అయిన కొంతమంది ఆటగాళ్లు కూడా వెస్టిండీస్‌లోనే ఉండిపోయారు. దీంతో బీసీసీఐ భారత్-జింబాబ్వే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జింబాబ్వే వెళ్లే జట్టులో 3 కొత్త పేర్లు చేరాయి.

జింబాబ్వే టూర్ కోసం ప్రకటించిన టీమ్‌లో బీసీసీఐ మంగళవారం 3 మార్పులు చేసింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని ఈ జట్టులో జితేష్ శర్మ, హర్షత్ రాణా, సాయి సుదర్శన్‌లు చోటు దక్కించుకున్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌ల స్థానంలో జట్టులోకి రానున్నారు. సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ ప్రస్తుతం బార్బడోస్‌లో ప్రపంచ కప్ విజేత జట్టుతో ఉన్నారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి భర్తీకి బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.

సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌ల పునరాగమనానికి సంబంధించి, వారు ఎప్పుడు స్వదేశానికి తిరిగి వస్తారనేది ఖచ్చితంగా చెప్పలేం. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జట్టు భారత్‌కు వచ్చిన తర్వాత కొన్ని సన్మాన వేడుకల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ జింబాబ్వే పర్యటన ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే బీసీసీఐ ఇప్పటికే ముగ్గురు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది.

జింబాబ్వేతో జరిగే తొలి రెండు టీ20 మ్యాచ్‌లకు మాత్రమే జితేష్ శర్మ, హర్షత్ రాణా, సాయి సుదర్శన్‌లు భారత జట్టులోకి వచ్చారు. జులై 6, 7 తేదీల్లో భారత్, జింబాబ్వే మధ్య తొలి రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత జట్టు (తొలి 2 మ్యాచ్‌లకు): శుభమన్ గిల్ (కెప్టెన్), రితురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, ర్యాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, జితేశ్ శర్మ , హర్షత్ రానా, సాయి సుదర్శన్.

Show Full Article
Print Article
Next Story
More Stories