IPL చరిత్రలో బెంగళూరు చేసిన 3 కీలక తప్పులు.. ఎన్నో ఆశలు పెట్టుకుంటే, వెన్నుపోటు పోడిచిన ఆటగాళ్లు..

From Cheteshwar Pujara to Kyle Jamieson and Alzarri Joseph These 3 Worst Picks by RCB in IPL  Auction History
x

IPL చరిత్రలో బెంగళూరు చేసిన 3 కీలక తప్పులు.. ఎన్నో ఆశలు పెట్టుకుంటే, వెన్నుపోటు పోడిచిన ఆటగాళ్లు..

Highlights

RCB: గత 17 ఏళ్లలో విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, యువరాజ్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడినప్పటికీ ట్రోఫీని గెలవలేకపోయారు.

Worst Pick By RCB In IPL Auction History: ఐపీఎల్ మొదటి ఎడిషన్ 16 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు 17 సీజన్‌లు గడిచినా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్‌ను గెలవలేకపోయింది. అయితే, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, యువరాజ్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ జట్టు తరపున ఆడినప్పటికీ టైటిల్ గెలవలేకపోయారు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఆటతీరుతో పాటు వేలంలో జట్టు వ్యూహాలపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. IPL వేలం చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన 3 అతిపెద్ద తప్పులను ఓసారి చూద్దాం.. ఈ ముగ్గురు ఆటగాళ్ల కోసం RCB భారీ మొత్తాన్ని వెచ్చించింది. కానీ, వారి ప్రదర్శనతో బెంగళూరు ఫ్రాంచైజీని నిరాశపరిచారు.

చెతేశ్వర్ పుజారా..

IPL వేలం 2011లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3.22 కోట్ల రూపాయలకు చెతేశ్వర్ పుజారాను కొనుగోలు చేసింది. అయితే, ఈ బ్యాట్స్‌మన్ అతని ఆటతో నిరాశపరిచాడు. ఛెతేశ్వర్ పుజారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 3 సీజన్లు ఆడాడు. ఈ 3 సీజన్లలో, చెతేశ్వర్ పుజారా 14 మ్యాచ్‌లలో 14.3 సగటు, 94.07 స్ట్రైక్ రేట్‌తో 143 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఛెతేశ్వర్‌ పుజారాకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాలేదు.

కైలీ జామిసన్..

ఐపీఎల్ వేలం 2021లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైలీ జేమీసన్‌ను రికార్డు స్థాయిలో రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, ఈ ఆటగాడు అంచనాలను అందుకోలేకపోయాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కైలీ జేమీసన్ 9 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా బ్యాటింగ్‌లో 65 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

అల్జారీ జోసెఫ్..

IPL వేలం 2023లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 11.5 కోట్లకు అల్జారీ జోసెఫ్‌ను కొనుగోలు చేసింది. కానీ, ఈ కరీబియన్ బౌలర్ పూర్తిగా అపజయం పాలయ్యాడు. అల్జారీ జోసెఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 3 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఈ ఫాస్ట్ బౌలర్ 11.9 ఎకానమీ రేటుతో 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories