Rahul Dravid: రెండు నెలల వ్యవధిలో.. ద్రవిడ్ కొడుకు మరో రికార్డు

Rahul Dravid: రెండు నెలల వ్యవధిలో..  ద్రవిడ్ కొడుకు మరో రికార్డు
x
DRAVID File Photo
Highlights

టీమిండియా మాజీ సారథి, జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ ద్విశతకాలతో మరోసారి చెలరేగాడు

టీమిండియా మాజీ సారథి, జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ ద్విశతకాలతో మరోసారి చెలరేగాడు. జూనియర్ లెవల్ క్రికెట్‌లో గత ఏడాది డిసెంబరులో డబుల్ సెంచరీ బాదిన సమిత్ ద్రవిడ్ .. తాజాగా మరోసారి అండర్-14 బీటీఆర్ షీల్డ్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. కాగా.. 2019 డిసెంబరులో అండర్-14 ఇంటర్ జోనల్ టోర్నీలో వైస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు తరఫు బరిలోకి దిగిన సమిత్ ద్రవిడ్.. 256 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 201 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. దాంతో.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే సమిత్ ద్రవిడ్ రెండు డబుల్ సెంచరీలు నమోదు రాకార్డు నెలకొప్పాడు. .

మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీ కుమారన్ టీమ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మాల్యా అదితి స్కూల్ తరపున బరిలోకి దిగిన సమిత్ 33 ఫోర్లతో 204 పరుగులు సాధించాడు. మాల్యా టీమ్ 3 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగలిగింది. లక్ష్య చేధనలో 267 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో 110 పరుగులకే శ్రీ కుమారన్ టీమ్ ఆలౌటైయింది. ఇక ఈ మ్యాచ్‌లో చిచ్చర పిడుగు సమిత్ ద్రవిడ్ బ్యాట్‌తోనే కాదు.. రెండు వికెట్లు పడగొట్టి బాల్ తోనూ సత్తాచాటాడు.

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ద్రవిడ్ తర్వాత టీమిండియా అండర్-19, భారత్-ఎ జట్టుకి కోచ్‌గా సేవలు అందించారు. ఇటీవల రాహుల్ ద్రవిడ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. టీమిండియా జట్టు క్రికెటర్లు ఎవరైనా గాయపడితే ఎన్సీఏ ద్వారా తిరిగి శిక్షణ తీసుకుని ఫిట్‌నెస్ సాధించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories