Brad Hogg about MS Dhoni: ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?

Brad Hogg about MS Dhoni: ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?
x
MS. Dhoni(File Photo)
Highlights

Brad Hogg about MS Dhoni: ఎంఎస్ ధోని.. ఒంటిచేత్తో టీంఇండియా జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు.

Brad Hogg about MS Dhoni: ఎంఎస్ ధోని.. ఒంటిచేత్తో టీంఇండియా జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్ గా ధోని యంగ్ స్టర్స్ కి స్ఫూర్తి.. అయితే భవిష్యత్తు కాలంలో ధోని స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అన్నది ఇప్పుడు సెలక్టర్లకు ముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న.. ధోని టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ స్థానంలో వ్రుద్దిమాన్ సాహా కొనసాగుతున్నాడు. సెలక్టర్లు ఇచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటున్నాడు.

ఇక మరోవైపు రిషభ్‌ పంత్‌ కూడా ఆదరగోడుతున్నాడు. 2018లో జరిగిన ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన టెస్టుల్లో పంత్‌ నిలకడగా రాణిస్తూ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. ఇటీవల కేఎల్‌ రాహుల్‌ కూడా అటు బాట్స్ మెన్ గా , ఇటు కీపర్ గా అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తున్నాడు. కివీస్‌ పర్యటనలో అతడి ఆటే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఈ నేపధ్యంలో ధోనీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై తాజాగా ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్‌ బ్రాడ్‌హాగ్‌ స్పందించాడు. మూడు ఫార్మాట్లలోనూ ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు మాత్రం రిషభ్‌పంత్‌ అంటూ అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో అతడే కీలక ఆటగాడిగా మారతాడని బ్రాడ్‌హాగ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే దీనికోసం అతడి తన ఆటను మరింతగా మెరుగు పరుచుకోవాలని అన్నాడు. అందుకోసం అతనికి మంచి కోచ్‌ సహాయపడాలని అన్నాడు.

ఇక ఇటు ధోని విషయానికి వచ్చేసరికి గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ తర్వాత ధోని మళ్ళీ జట్టులోకి వచ్చింది లేదు. మళ్ళీ ఈ ఏడాది జరబోయే IPL లో మంచి ప్రదర్శనను కనబరిచి జట్టులోకి వద్దామని ధోని భావించాడు కానీ కరోనా నేపధ్యంలో IPL వాయిదా పడింది. మళ్ళీ జట్టులోకి ధోని పునరాగమనం ప్రశ్నార్ధకంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories