అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత..

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత..
x
Highlights

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే ఆయన శస్త్ర చికిత్స...

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే ఆయన శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దాంతో తీవ్ర గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.

డిగె మారడోనా 1960 అక్టోబర్ 30న అర్జెంటీనాలో జన్మించారు. 1986లో అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్‌ అందించారు. ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు మేనేజర్‌గా ఉన్నారు. ఆల్‌టైమ్‌ గ్రేట్ ఫుట్‌బాల్ ఆటగాడిగా ఆయన కీర్తి గడించారు. 1990 వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అర్జెంటీనా తరపున 96 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన డిగో 34 గోల్స్ చేశాడు. నాలుగుసార్లు ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు ప్రాతినిధ్యం వహించిన మారడోనా 1997లో ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.

2008లో అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు. యూఏఈ, మెక్సికో జాతీయ జట్టుకు మేనేజర్‌గా కూడా మారడోనా పనిచేశారు. ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాల‌ర్స్‌లో ఒక‌డిగా పేరుగాంచిన డీగో ఎంత గొప్ప ప్లేయ‌రో అన్ని వివాదాల్లోనూ నిలిచారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడలో తనదైన ముద్రవేసిన మారడోనా మరణ వార్త తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories