రెండో టెస్ట్ కి ముందే భారత్ కి షాక్

రెండో టెస్ట్ కి ముందే భారత్ కి షాక్
x
ishanth sharma(file Photo)
Highlights

న్యూజిలాండ్‌ జట్టుతో రేపటినుంచి జరగబోయే రెండు టెస్ట్ కి ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇండియన్ ఫాస్ట్ ఫాస్ట్

న్యూజిలాండ్‌ జట్టుతో రేపటినుంచి జరగబోయే రెండు టెస్ట్ కి ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇండియన్ ఫాస్ట్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. మ్యాచ్ కోసం ప్రాక్టిస్ చేస్తుండగా ఇషాంత్ కి గాయం అయింది. ఇషాంత్ కాలి మడమకి గాయం కావడంతో అతనికి కనీసం నెల రోజులు క్రికెట్‌కి ఉండాల్సిందిగా వైద్యులు వెల్లడించినట్టుగా సమాచారం.. అయితే ఇక ఇప్పటికే యువ ఓపెనర్ పృథ్వీ షా గాయంతో రెండో టెస్టులో ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి..

న్యూజిలాండ్‌ జట్టుతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ మొదటి మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని జట్టు ఆశిస్తున్న క్రమంలో ఇషాంత్ శర్మ గాయపడటం భారత్ జట్టును కలవరపెడుతోంది. మొదటి మ్యాచ్ లో భారత్ ఓడిపోయినప్పటికి ఇషాంత్‌ మాత్రం అదరగొట్టాడు. 68 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ శర్మ స్థానంలో రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ లేదా నవదీప్ సైనీని జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఆ జట్టుతో జరిగిన అయిదు టీ20 మ్యాచ్ లో భారత్ కివీస్ జట్టును క్లీన్ స్వీప్ చేయగా, మూడు వన్డేల సీరీస్ లో భారత్ ని కివీస్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది.

ఈ టెస్ట్ సిరీస్ కి ముందు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఇషాంత్ శ‌ర్మ గాయ‌ప‌డ్డాడు. ఇందులో చీల‌మండ గాయానికి ఇషాంత్ శర్మ గుర‌య్యాడు. గాయం నుంచి కోలుకొని మళ్ళీ ఫిట్‌నెస్ సాధించాడు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories