Ashok Dinda: టీమిండియా మాజీ క్రికెటర్ పై దాడి

Ashok Dinda
x
అశోక్ దిండా 
Highlights

Ashok Dinda:టీమిండియా మాజీ క్రికెటర్ బౌలర్ ఆశోక్ దిండాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

Ashok Dinda: టీమిండియా మాజీ క్రికెటర్ బౌలర్ ఆశోక్ దిండాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో ఉన్న దిండా మెయినా నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన అక్కడ రోడ్ షో ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. దిండా వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. వ్యూహాత్మకంగా రోడ్లని బ్లాక్ చేసి దుండగులు దాడి చేయడంతో దిండా తప్పించుకోలేకపోయారు. దాంతో అతనికి తీవ్రగాయాలైయ్యాయి.

ఈ సందర్బంగా దిండా మెనేజర్ పూర్తి వివరాలు వెల్లడించారు. స్థానిక తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ దాడికి పాల్పడినట్లు కూడా అశోక్ దిండా మేనేజర్ ఆరోపించాడు. రోడ్ షో ముగించుకుని అశోక్ దిండా తన అనచరులతో కలిసి ఎస్‌యూవీ వాహనంలో వెళ్తుండగా.. ఈ దాడి జరిగిందని అతని మేనేజర్‌ వెల్లడించాడు. అయితే.. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. అశోక్ దిండా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న కొంత మంది బీజేపీ నాయకులే ఆ దాడికి పాల్పడి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు.

మరోవైపు అశోక్ దిండాపై దాడి గురించి సవివరంగా రిపోర్ట్ సమర్పించాలని జిల్లా అధికారుల్ని ఎలక్షన్ కమీషన్ ఆదేశించింది. 2009లో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన అశోక్ దిండా.. 2013 వరకూ టీమిండియా తరపున ఆడాడు. ఐపీఎల్‌లో మాత్రం 2017 వరకూ ఈ బౌలర్ మ్యాచ్‌లు ఆడాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories