IPL 2024: ఐపీఎల్ సమరానికి సర్వం సిద్ధం

Everything Is Ready For The IPL Match
x

IPL 2024: ఐపీఎల్ సమరానికి సర్వం సిద్ధం

Highlights

IPL 2024: మార్చి 22 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు మ్యాచ్ లు

IPL 2024: క్రికెట్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ సమరానికి రంగం సిద్ధం అయ్యింది. రెండు విడతలుగా ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. పది వేదికల్లో 21 మ్యాచ్ లు జరగనున్నాయి. ఐపీలీల్ ట్రోఫీ కోసం పది జట్లు యుద్దానికి సిద్ధం అయ్యాయి. టైటిల్ గెలుచుకునేందుకు అన్ని జట్లు ప్రత్యేకమైన వ్యూహాలను రచించుకున్నాయి. కొన్ని జట్లు పాత కెప్టెన్లను పక్కన పెట్టి నూతన సారథులతో కొత్త ఎడిషన్ కోసం సిద్దం అయ్యాయి.

తొలి విడతగా మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు పోటీలు జరగనున్నాయి. 17 రోజుల పాటు మొదటి విడత పోటీలు జరగనున్నాయి. వీటిలో నాలుగు రోజులు డబుల్ హెడ్డర్ మ్యాలు ఉన్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మెగా లీగ్ ప్రారంభం కానున్నది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఏప్రీల్ 7 వ తేదీన లక్నో వేదికగా లక్నో సూపర్ జాయింట్స్, గుజరాత్ మధ్య జరిగే మ్యాచ్ తో తొలిదశ పోటీలు ముగియనున్నాయి.

తొలి విడతలో జరిగే 21 మ్యాచుల్లో తెలుగు రాష్ర్టాల్లో నాలుగు మ్యాచ్ లు జరగనున్నాయి. హైదరాబాద్ లో రెండు, వైజాగ్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలివిడత పోటీలకు ఢిల్లీ క్యాపిటెల్స్ జట్టు వైజాగ్ ను హోంగ్రౌండ్ గా ఎంచుకోగా.. హైదరాబాద వేదికగా మార్చి 27న సన్ రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య మాచ్ జరగున్నది. ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్ జరగనున్నది. ఈనెల 31న వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ తో తొలి మ్యాచ్ జరగనుండగా... ఏప్రిల్ 3న కోల్ కతా నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి.

ఐపీఎల్‌-2024 తొలి దఫా షెడ్యూల్‌లో 21 మ్యాచ్‌లు

మార్చి 23, 24, 31, ఏప్రిల్‌7న డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు

మార్చి 22- చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

మార్చి 23- పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌

మార్చి 23- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్

మార్చి 24- రాజస్తాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌

మార్చి 24- గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌

మార్చి 25- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-పంజాబ్‌ కింగ్స్‌

మార్చి 26- చెన్నై సూపర్‌ కింగ్స్‌-గుజరాత్‌ టైటాన్స్‌

మార్చి 27- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- ముంబై ఇండియన్స్

మార్చి 28- రాజస్తాన్‌ రాయల్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌

మార్చి 29- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-కోల్‌కతా నైట్‌ రైడర్స్

మార్చి 30- లక్నో సూపర్‌ జెయింట్స్‌- పంజాబ్‌ కింగ్స్‌

మార్చి 31- గుజరాత్‌ టైటాన్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్

మార్చి 31- ఢిల్లీ క్యాపిటల్స్‌- సీఎస్‌కే

ఏప్రిల్‌ 1- ముంబై ఇండియన్స్- రాజస్తాన్

ఏప్రిల్‌ 2- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- లక్నో

ఏప్రిల్‌ 3- ఢిల్లీ క్యాపిటల్స్‌- కోల్‌కతా నైట్‌ రైడర్స్

ఏప్రిల్‌ 4- గుజరాత్‌- పంజాబ్‌ కింగ్స్‌

ఏప్రిల్‌ 5- సన్‌రైజర్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఏప్రిల్‌ 6- రాజస్తాన్‌ రాయల్స్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

ఏప్రిల్‌ 7- ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్‌

ఏప్రిల్‌ 7- లక్నో సూపర్‌ జెయింట్స్‌-గుజరాత్‌ టైటాన్స్

Show Full Article
Print Article
Next Story
More Stories