సూపర్ ఓవర్ టై: అయినా ఇంగ్లాండ్‌కి విజయం ఎలా వరించింది?

సూపర్ ఓవర్ టై: అయినా ఇంగ్లాండ్‌కి విజయం ఎలా వరించింది?
x
Highlights

నరాలు తెగే ఉత్కంఠ. బంతి బంతికి ఎక్కడ లేని ఉద్వేగం. నెల రోజులకు పైగా సాగిన క్రికెట్ వేడుక ఆఖరి రోజు సగటు క్రికెట్‌ అభిమానికి కిక్‌ ఇచ్చింది. మ్యాచ్ టై...

నరాలు తెగే ఉత్కంఠ. బంతి బంతికి ఎక్కడ లేని ఉద్వేగం. నెల రోజులకు పైగా సాగిన క్రికెట్ వేడుక ఆఖరి రోజు సగటు క్రికెట్‌ అభిమానికి కిక్‌ ఇచ్చింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌ ఆడాల్సి వచ్చింది. సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగిసింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. అత్యధిక బౌండరీలు సాధించడంతో ఇంగ్లాండ్‌ జగజ్జేతగా నిలిచింది.

ఇంగ్లండ్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఉత్కంఠ భరిత ఫైనల్‌లో న్యూజిలాండ్‌ జట్టు ఓటమి పాలయింది. వరల్డ్ కప్‌ విజేతగా నిలవాలన్న ఇంగ్లండ్ కల తొలిసారిగా నెరవేరింది. ఇంగ్లండ్ గెలుపులో బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 241 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రా అయింది. విజేత ఎవరో తేల్చడానికి సూపర్ ఓవర్ నిర్వహించారు.

సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 15 పరుగులు చేసింది. స్టోక్స్, బట్లర్ చెరో ఫోర్ కొట్టి ఇంగ్లండ్ ఆశలకు ఊపిరి పోశారు. 16 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు సూపర్ ఓవర్ ముగిసే సమయానికి 15 పరుగులు చేసింది. మళ్లీ మ్యాచ్ డ్రా అయింది. అయితే సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్ జట్టు సిక్స్ కొట్టినప్పటికీ ఇంగ్లండ్ జట్టు రెండు ఫోర్లు కొట్టడంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టుదే విజయం అనే నిబంధన ప్రకారం ఈ వరల్డ్ కప్ ఇంగ్లండ్ జట్టునే వరించింది. ఇంగ్లండ్ జట్టు తొలిసారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోవడంతో ఆతిథ్య జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మొత్తం మీద మోర్గాన్ సేన చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ గెలుపులో బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ కీలక పాత్ర పోషించారు.

వరల్డ్ కప్‌‌లో ఆడిన మ్యాచులన్నిటిలోను అద్భుతంగా ఆడిన కివీస్ కెప్టెడన్ విలియమ్సన్ ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో అద్బుతంగా రాణించిన ఇంగ్లండ్ ప్లేయర్ బెన్‌ స్టోక్స్ మ్యాచ్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు. గత మూడు ప్రపంచకప్‌లను పరిశీలిస్తే ఒక విశేషం కనిపిస్తోంది. ఏ జట్టయితే వరల్డ్‌కప్‌కు ఆతిధ్యమిస్తుందో ఆ జట్టే కప్పును కైవసం చేసుకుంటోంది. 2011 లో ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఆతిధ్య మిచ్చిన ఇండియా ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 2014లో వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా ఆతిధ్య మిచ్చింది. ఆ జట్టే విజేతగా నిలిచింది. 2019లో జరిగిన వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్ దేశం హోస్ట్‌గా వ్యవహరించగా ఆజట్టే విశ్వవిజేతగా అవతరించతింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories