India Vs Engalnd: ఇంగ్లాండ్ టార్గెట్ 125, బ్యాటింగ్ లో తడబడిన టీంఇండియా
India Vs Engalnd 1st T20: 1st టీ20లో భారత్ పరుగులు చేయడంలో తడబడింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగుల చేసింది.
India Vs Engalnd 1st T20: ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు ప్రారంభంమైన మొదటి టీ20లో టాస్ ఓడిన టీం ఇండియా బ్యాటింగ్‌లో తడబడింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో కేవలం 124/7 కే పరిమితమైంది. రాహుల్, ధావన్ తో బ్యాటింగ్ ప్రారంభించిన టీం ఇండియా..రెండో ఓవర్లో జోఫ్రా ఆర్చర్ విసిరిన బంతికి రాహుల్ (1 పరుగు 4 బంతులు) బౌల్డ్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (0 పరుగులు 5 బంతులు) నిరాశపరిచాడు. మూడో ఓవర్లో రషీద్ బౌలింగ్ జోర్దాన్ కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
మరోవైపు శిఖర్ ధావన్ (4పరుగులు 12 బంతులు) కూడా పరుగుల కోసం చాలా కష్టపడుతూ.. 5 ఓవర్లో మార్క్ వుడ్ వేసిన బంతికి బౌల్డ్ అయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి 20 పరుగులకు 3 వికెట్లు కోల్పయి కష్టాల్లో పడింది టీం ఇండియా. అనంతరం బ్యాటింగ్ వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తో కలిసి పంత్ ఇన్సింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. 10 ఓవర్లకు 50 పరుగులకు 3 వికెట్లు కోల్సోయింది. ఆ తర్వాత పంత్ 21 పరుగులు (23 బంతులు, 2ఫోర్లు, 1 సిక్స్) కూడా పెవిలియన్ కు క్యూ కట్టాడు. ఇక ఆ తర్వాత టీం ఇండియాను శ్రేయాస్(67 పరుగులు 48 బంతులు, 8ఫోర్లు, 1 సిక్స్) భుజాలపై వేసుకున్నాడు. 20వ ఓవర్లో జోర్గాన్ చేతికి చిక్కి వెనుదిరిగాడు.
మిగతా బ్యాట్స్ మెన్స్ పెలియన్ కు చేరడంతో టీం ఇండియా 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేసింది. హార్దిక్ పాండ్య 19 పరుగులు, శార్దుల్ 0 పరుగులు చేసి ఔట్ అయ్యారు. వాషింగ్ టన్ సుందర్ 3, అక్షర్ పటేల్ 7 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు, రషీద్, వుడ్, జోర్దాన్, స్టోక్స్ తలో వికెట్ తీశారు.
5⃣0⃣ & going strong! 💪💪
— BCCI (@BCCI) March 12, 2021
3⃣rd T20I half-century for @ShreyasIyer15 in 36 balls! 👍👍 @Paytm #INDvENG #TeamIndia move closer to 100.
Follow the match 👉 https://t.co/XYV4KmdfJk pic.twitter.com/nH1H70xI0X
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire