Pink Ball Test: స్పిన్నర్ల ధాటికి.. ఇంగ్లాండ్‌ విలవిల: 112 కే ఆలౌట్‌

England all out for 112 in Pink Ball Test First Innings
x

అక్షర్ పటేల్ (ఫొటో బీసీసీఐ ట్విట్టర్)

Highlights

Pink Ball Test: మొతెరా స్టేడియంలో టీమ్‌ ఇండియా అదరగొట్టింది.

Pink Ball Test: మొతెరా స్టేడియంలో టీమ్‌ ఇండియా అదరగొట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానంలో జరుగుతున్న తొలి డే/నైట్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ను స్పిన్ బౌలర్లు విలవిల్లాడించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టును కేవలం 112 పరుగులకే ఆలౌట్‌ చేసింది. యువ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ 6 వికెట్లతో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ ను వణికించాడు. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 3 వికెట్లు, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీసి..ఇంగ్లాండ్ ను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. ఇంగ్లాండ్‌ జట్టులో ఇంగ్లాండ్ టీంలో జాక్‌ క్రాలీ 53 (84 బంతుల్లో 10×4) పరుగులతో రాణించాడు. ఆరుగురు బ్యాట్స్ మెన్స్ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు.

ఇంగ్లాండ్ టీమ్ గత 50 ఏళ్లలో ఇలా 50 ఓవర్లు ఆడకుండా తక్కువ స్కోర్ కే ఆలౌట్ అవ్వడం ఇది 6వ సారి. మొతెరా పిచ్ అనుకున్నట్లుగానే స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంది. మొత్తం పది వికెట్లలో 9 వికెట్లు స్పిన్ బౌలర్లే తీసారంటే పిచ్ ను స్పిన్ బౌలర్లు ఎంతలా ఉపయోగించుకున్నారో తెలుస్తోంది.

భారత్‌పై ఇంగ్లాండ్‌ అత్యల్ప స్కోర్లు

101 ఓవల్‌లో 1971 సంవత్సరంలో..

102 ముంబయిలో 1979/80లో..

102 లీడ్స్‌లో 1986

112 అహ్మదాబాద్‌లో 2020/21 (మొతెరా స్టేడియంలో నేడు)

128 లీడ్స్‌లో 1986

Show Full Article
Print Article
Next Story
More Stories