Siraj Dismissed Konstas, Head: కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్.. వైరల్ అవుతున్న ఫోటోస్..!

Siraj Dismissed Konstas, Head: కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్.. వైరల్ అవుతున్న ఫోటోస్..!
x

Siraj Dismissed Konstas, Head: కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్.. వైరల్ అవుతున్న ఫోటోస్..!

Highlights

Siraj Dismissed Konstas, Head: సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు మహ్మద్ సిరాజ్ తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేస్తున్నాడు.

Siraj Dismissed Konstas, Head: సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు మహ్మద్ సిరాజ్ తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేస్తున్నాడు. ఒకే ఓవర్‌లో ఇద్దరు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు పడగొట్టి సిరాజ్ భారత్‌ను మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 12వ ఓవర్లో మహ్మద్ సిరాజ్ విధ్వంసం కనిపించింది. ఆ ఓవర్ రెండో బంతికే యువ బ్యాట్స్‌మెన్ సామ్ కాన్స్టాస్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. ఔట్ స్వింగ్ బాల్ లో కాన్స్టాస్ పూర్తిగా విఫలం అయ్యాడు. ఈ వికెట్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా కాన్స్టాస్‌ను అవుట్ చేశాడు.

దీంతో గ్రౌండ్ లోనే కాదు, సోషల్ మీడియాలోనూ సిరాజ్ ట్రెండ్ అవుతున్నాడు. సిరాజ్ తన ఓవర్లో శామ్ కాన్స్టాస్ (23), ట్రావిస్ హెడ్‌(4)లను అవుట్ చేశాడు. భారత బౌలర్లపై దూకుడుగా ఆడే స్వభావం ఉన్నటువంటి కాన్స్టాస్‌ను మంచి లెంగ్త్‌లో సిరాజ్ చేసిన షార్ప్ డెలివరీకి పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్‌ను కూడా అదే పద్ధతిలో సిరాజ్ ఔట్ చేసేశాడు. రెండో రోజు ప్రారంభంలోనే సిరాజ్ ఈ ఇద్దరు ఆటగాళ్లను పెవిలియన్ చేర్చడంతో అభిమానులు ట్రావిస్ హెడ్, సామ్ కాన్స్టాస్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

అయితే, తొలిరోజు ఆటలో శామ్ కాన్‌స్టాస్ అనవసరంగా బుమ్రాను కెలికాడు. ఆ వెంటనే బుమ్రా ఖవాజాను పెవిలియన్ చేర్చి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో సిరాజ్ ఆసీస్ ప్లేయర్ సామ్ కాన్‌స్టాస్‌ను పెవిలియన్ చేర్చి బుమ్రా ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ట్వీట్ల పై ఓ లుక్కేద్దాం. మొదటి రోజు 185 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత భారత జట్టు.. రెండో అద్భుతంగా తిరిగి ఫామ్ లోకి వచ్చింది. తాజాగా ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. మరో 84 పరుగుల వెనక నిలచింది.




Show Full Article
Print Article
Next Story
More Stories