IPL 2023: చెపాక్ స్టేడియంలో.. చెవులు చిల్లులు పడేలా... చెన్నై ఫ్యాన్స్.. ధటీజ్ ధోనీ..
IPL 2023: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది.
IPL 2023: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. అంతర్జాతీయ క్రికెట్ కు ఎంఎస్.ధోనీ గుడ్ బై చెప్పేసినా ఐపీఎల్ లో ఆడుతూ తన అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్ నడుస్తుండగా..ఇదే ధోనీకి చివరి సీజన్ అని ప్రచారం జరగడంతో...చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మ్యాచులకు ధోనీ అభిమానులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. చెన్నైతో సహా ఇతర రాష్ట్రాల్లో జరిగిన మ్యాచుల్లో సైతం తలా ఫ్యాన్స్ తో స్టేడియాలు నిండిపోతున్నాయి.
ఇక బుధవారం జరిగిన మ్యాచ్ లో ధోనీ ఫ్యాన్స్ చేసిన హంగామా వేరే లెవల్ లో ఉంది. సాధారణంగా ఓవర్ పూర్తైన తర్వాత, వికెట్ పడినప్పుడు, విరామ సమయంలో ప్రకటనలు వస్తాయి. కానీ, ధోనీ ఎంట్రీ ఇచ్చిన సమయంలో ప్రకటనలు ప్రసారం చేయకుండా ధోనీనే చూపించారు. ధోనీ బ్యాటింగ్ ను జియో సినిమా ద్వారా 80లక్షల మంది వీక్షించారు. ఇదంతా ఒకెత్తైతే స్టేడియంలో ధోనీ అభిమానులు చేసిన సందడితో స్టేడియం దద్దరిల్లింది. ధోనీ అంటూ అభిమానుల అరుపులతో స్టేడియం మార్మోగిపోయింది.
సౌండ్ డెసిబిల్స్ 90ని తాకింది. ఇదే హోరు ఓ 30 నిమిషాలు కొనసాగితే చెవులు దిబ్బలెక్కడం ఖాయమని ఓ అభిమాని చేతికి ఉన్న స్మార్ట్ ఫోన్ హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఏదిఏమైనా, ధోనీ అంటే మాస్ ఫాలోయింగ్ కి కేరాఫ్ అడ్రస్ అంటే అతిశయోక్తి కాదు.
I've never witnessed anything like this at a cricket stadium, MS Dhoni walking out to bat on his home turf. The crowd even celebrated the previous wicket to just get him to the crease. pic.twitter.com/UOueq8GlSr
— David Brooke (@BrookeBack13) May 10, 2023
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire