నో డౌట్‌... ఈ వరల్డ్‌ కప్‌లో ధోనీ గ్యారెంటీ!!

నో డౌట్‌... ఈ వరల్డ్‌ కప్‌లో ధోనీ గ్యారెంటీ!!
x
Highlights

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్.. మహేంద్ర సింగ్ ధోనీ....ఆస్ట్రేలియాతో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లో విశ్వరూపం ప్రదర్శించాడు. ...

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్.. మహేంద్ర సింగ్ ధోనీ....ఆస్ట్రేలియాతో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లో విశ్వరూపం ప్రదర్శించాడు. టీమిండియా చారిత్రక విజయంలో ప్రధానపాత్ర వహించడంతో పాటు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలవడం ద్వారా విమర్శకులకు తనదైన స్టయిల్లో సమాధానం చెప్పాడు. వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకొన్నాడు. 37 ఏళ్ల లేటు వయసులో కుర్రాళ్లతో

పోటీపడుతున్నాడు జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ.

భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీ...తన కెరియర్ ను 2019 ప్రపంచకప్ వరకూ కొనసాగించే విషయమై ముసురుకొన్న మేఘాలు...ఒక్క దెబ్బతో దూదిపింజాల్లా తేలిపోయాయి. ధోనీని తప్పించి యువఆటగాళ్లకు అవకాశం కల్పించాలంటూ ఇటీవలి కాలంలో వచ్చిన విమర్శలకు..... ఆస్ట్రేలియాతో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ ద్వారా తెరపడింది.

ప్రస్తుత భారత నవతరం క్రికెటర్లలో చాలామంది కంటే... 37 ఏళ్ల ధోనీ మహా చురుకుగా, ఫిట్ గా ఉన్నాడంటూ గతంలోనే టీమిండియా చీఫ్ కోచ్ రవి శాస్త్రి ప్రశంసల వర్షం కురిపిస్తే.... ధోనీని మించిన అంకితభావం కలిగిన క్రికెటర్ మరొకరులేరంటూ...కెప్టెన్ కొహ్లీ ఆకాశానికి ఎత్తేశాడు. 2019 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో ధోనీ చోటు పక్కా అంటూ తేల్చిచెప్పాడు. కూల్ కూల్ కెప్టెన్ గా, లైట్నింగ్ వికెట్ కీపర్ గా...డాషింగ్ బ్యాట్స్ మన్ గా....గొప్ప మ్యాచ్ ఫినిషర్ గా...గత దశాబ్దకాలంగా భారత క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన ధోనీ... ప్రస్తుతం టీమిండియాకు పెద్దదిక్కుగా...కెప్టెన్ విరాట్ కొహ్లీకి.. కొండంత అండగా నిలిచాడు. టీమిండియా ను టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా నిలపడంలోనూ....వన్డే, టీ-20, మినీ ప్రపంచకప్ టోర్నీల్లో విజేతగా నిలపడంలో సారథిగా ధోనీ నిర్వహించిన పాత్ర అంతాఇంతా కాదు.

2004లో స్టీల్ సిటీ విశాఖ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాక్ తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన....ధోనీ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు.

ఆస్ట్రేలియాతో ముగిసిన 2019 వన్డే సిరీస్ వరకూ...14 ఏళ్ల కెరియర్ లో 335 వన్డేలు ఆడిన ధోనీ...మొత్తం 10 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో 10వేల 366 పరుగులు సాధించాడు. అంతేకాదు...ఆస్ట్రేలియాతో ప్రస్తుత సిరీస్ లోని మూడుకు మూడు వన్డేల్లోనూ ధోనీ హాఫ్ సెంచరీలు సాధించాడు. మొత్తం 193 పరుగులతో...ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకొన్నాడు. 37 సంవత్సరాల 195 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకొన్న ఏకైక క్రికెటర్ గా ధోనీ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ సునీల్ గవాస్కర్ పేరుతో ఉన్న రికార్డును తెరమరుగు చేశాడు.

ఆస్ట్రేలియా గడ్డపైన వెయ్యి పరుగులు సాధించిన నాలుగో భారత క్రికెటర్ గా కూడా ధోనీ గుర్తింపు తెచ్చుకొన్నాడు. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీల సరసన చోటు సంపాదించాడు. ధోనీ..2019 సీజన్ మొదటి మూడుమ్యాచ్ ల్లోనే మూడు హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా...విమర్శకులకు తగిన విధంగా సమాధానం చెప్పాడు. 2019 ప్రపంచకప్ టోర్నీ వరకూ....భారత జట్టు సభ్యుడిగా కొనసాగనున్న ధోనీ....వికెట్ కీపర్ గా....నాలుగో నంబర్ స్థానంలో ఆడగల సత్తా ఉన్న బ్యాట్స్ మన్ గా...అపారఅనుభవం ఉన్న ఆటగాడిగా... టీమిండియాకు కొండంత అండ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 37 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా దూసుకుపోతున్న ధోనీకి....హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories