IPL 2021 - David Warner: నేను వచ్చినా జట్టులో ఆడిస్తారో లేదో..!!

David Warner Shared His Doubt in Twitter is Place Of Playing Eleven in Sunrisers Hyderabad Team in IPL 2021
x

డేవిడ్ వార్నర్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

David Warner: అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టు తరపున స్టార్ బ్యాట్స్ మెన్ గా, కెప్టెన్ గానే కాకుండా క్రికెట్ లో హేటర్స్ లేని ఒక ఆటగాడిగా...

David Warner: అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టు తరపున స్టార్ బ్యాట్స్ మెన్ గా, కెప్టెన్ గానే కాకుండా క్రికెట్ లో హేటర్స్ లేని ఒక ఆటగాడిగా డేవిడ్ వార్నర్ అందరికి సుపరిచితమే. ఐపీఎల్ లో ప్రస్తుతం హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్న డేవిడ్ వార్నర్ త్వరలో జరగబోయే ఐపీఎల్ రెండో షెడ్యుల్ లో పాల్గొనబోతున్న వార్తని "ఐ విల్ బీ బ్యాక్" అంటూ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. మొదటి షెడ్యుల్ లో సరైన ఆట తీరు ప్రదర్శించకపోవడంతో పాటు వరుస ఓటమిలతో సతమతమవుతున్న సన్ రైసర్స్ జట్టులో నుండి వార్నర్ ను సారధ్య బాధ్యతల నుండి తొలగించి కెన్ విలియంసన్ కి కెప్టెన్సీ అప్పజెప్పి టీం యాజమాన్యం కొంతవరకు ఇబ్బంది పెట్టిందనే తెలుస్తుంది.

ఇక రాజస్తాన్ rరాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో వార్నర్ బెంచ్ కే పరిమితమైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో దాదాపుగా 60 పరుగుల తేడాతో సన్ రైసర్స్ జట్టు ఘోరంగా ఓటమి పాలయింది. మరోపక్క విలియంసన్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో అటు అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు ఐపీఎల్ లోను రాణిస్తుండటంతో డేవిడ్ వార్నర్ వచ్చిన సారధ్య బాధ్యతలు మాత్రం విలియంసన్ కే ఉంటాయని తెలుస్తుంది.

ఇటీవల డేవిడ్ వార్నర్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో లైవ్ లో ఉన్న సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను రెండో దశ ఐపీఎల్ కోసం వస్తున్నానని, ఈసారైనా సన్ రైసర్స్ హైదరాబాద్ తుది జట్టులో స్థానం లభిస్తుందో లేదో అంటూ తన కాస్త నిరాశ చెందాడు. మరి ఈ రానున్న రెండో షెడ్యుల్ లోనైన విలియంసన్, బేర్ స్టౌ వంటి ఆటగాళ్ళలో ఒకరిని పక్కనపెట్టి డేవిడ్ వార్నర్ కి అవకాశం లభిస్తుందో లేదో చూడాల్సిందే..!!


Show Full Article
Print Article
Next Story
More Stories