IPL 2020: ఐపీఎల్2020లో హట్ ఫెవరెట్‌గా బారిలో దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్ తగిలింది. నిన్న కరోనా కలకలంతో సాధనకు బ్రేక్ పడగా, నేడు మరో సంచలన వార్త వెలువడింది
IPL 2020: ఐపీఎల్2020లో హట్ ఫెవరెట్‌గా బారిలో దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్ తగిలింది. నిన్న కరోనా కలకలంతో సాధనకు దూరంకాగా.. నేడు మరో సంచలన వార్త వెలువడింది. అదే భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా ఐపిఎల్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ప్రకటించింది. సురేష్ రైనా వ్యక్తిగత కారణాల వల్ల భారతదేశానికి తిరిగి వచ్చారని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కెఎస్ విశ్వ నాథన్ తెలిపారు. అతను మిగిలిన ఐపిఎల్ సీజన్ లో అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ సురేష్ మరియు అతని కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు. ఈ వార్త టీంకు పరిణమం శరాఘాతంలా మారింది.
ఐపిఎల్ వచ్చే నెల 17 నుంచి జరుగుతుంది. ఈ టోర్నీ కోసం గానూ ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్ చేరుకున్నాయి. నిన్న చెన్నై ఫాస్ట్ బౌలర్ ఒకరికి కరోనా వచ్చినట్టు నిర్ధారించారు. అలాగే 11 మంది స్టాఫ్ కి కూడా కరోనా సోకిందని నిర్ధారించారు. దీనితో అప్రమత్తం అయ్యాయి మిగిలిన ఐపిఎల్ టీమ్స్ కూడా. ఇప్పుడు ఈ వార్తతో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్ మెంట్ కు, క్రికెట్ ప్రేమికులకు నిరాశ కలిగిస్తుంది.
Suresh Raina has returned to India for personal reasons and will be unavailable for the remainder of the IPL season. Chennai Super Kings offers complete support to Suresh and his family during this time.
— Chennai Super Kings (@ChennaiIPL) August 29, 2020
KS Viswanathan
CEO
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire