కోల్‌కతాపై చెన్నై విజయం

కోల్‌కతాపై చెన్నై విజయం
x
Highlights

అనుభవజ్ఞులతో నిండిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి సమష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. ఐపీఎల్‌–12 సీజన్‌లో ఏడో విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా...

అనుభవజ్ఞులతో నిండిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి సమష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. ఐపీఎల్‌–12 సీజన్‌లో ఏడో విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇక్కడి ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తాహిర్ స్పిన్ (4/27)కు తోడు లక్ష్య ఛేదనలో సురేశ్ రైనా (42 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఘనవిజయం సాధించింది. నైట్‌రైడర్స్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివర్లో జడేజా (17 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) సహకారంతో జట్టును గెలిపించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories