IPL 2022: సురేష్ రైనాని వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్..!?

Chennai Super Kings Team Loose The Suresh Raina in IPL 2022 Because Of Retainment Option
x

సురేష్ రైనా (ఫైల్ ఫోటో)

Highlights

IPL 2022: సురేష్ రైనా, ఎంఎస్ ధోని అటు టీం ఇండియా జట్టులోనే కాకుండా ఐపీఎల్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఎన్నో మ్యాచ్ లలో ఆడి ఘన విజయాలు...

IPL 2022: సురేష్ రైనా, ఎంఎస్ ధోని అటు టీం ఇండియా జట్టులోనే కాకుండా ఐపీఎల్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఎన్నో మ్యాచ్ లలో ఆడి ఘన విజయాలు సాధించిన ఈ ఇద్దరు మిత్రులని 2022 ఐపీఎల్ లో ఒకే జట్టులో చూడలేకపోతామా అంటే నిజమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రైనా కెరీర్లో ధోని కంటే గొప్ప కెప్టెన్ చూడలేదని, తనంటే క్రీడా పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో అభిమానిస్తానని పలుమార్లు రైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే అంతర్జాతీయ క్రికెట్ నుండి రైనా కూడా వైదొలుగుతున్నట్లు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చాడు. అయితే కొన్ని ఏళ్ళుగా చెన్నై తరపున ఆడుతున్న రైనా తాజా ఐపీఎల్ నిబంధనల ప్రకారం చెన్నై జట్టు నుండి దూరం అయితున్నట్లు తెలుస్తుంది.

2022లో 10 జట్లతో జరగబోయే ఐపీఎల్ కోసం ఒక టీంకి నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం ఆ నలుగురి ఎంపిక కోసం తర్జన భర్జన పడ్డారు. చివరికి సురేష్ రైనా లేకుండానే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఆ నలుగురి పేర్లను అనధికార సమాచారం. ప్రస్తుతం 2022 జట్టులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజాతో పాటు విదేశీ ఆటగాళ్ళు డుప్లేసిస్, డారెన్ బ్రేవో లను రిటైన్ చేసుకోబోతున్నట్లు సమాచారం. రిటైన్ నిబంధనల ప్రకారం చాలా జట్లు ఎన్నో ఏళ్లుగా జట్టు తరపున ఆడుతున్న మంచి ప్లేయర్స్ ని వదులుకోవడంతో అటు టీం యాజమాన్యంతో పాటు అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories