BCCI vs PCB: ఐసీసీ సమావేశానికి జైషా, మొహ్సిన్ నఖ్వీ.. ఛాంపియన్స్ ట్రోఫీపై వాడీ వేడి చర్చ

Champions Trophy 2025 BCCI vs PCB Clash at ICC Meetings in Colombo on July 19th BCCI secretary jay shah
x

BCCI vs PCB: ఐసీసీ సమావేశానికి జైషా, మొహ్సిన్ నఖ్వీ.. ఛాంపియన్స్ ట్రోఫీపై వాడీ వేడి చర్చ

Highlights

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి వచ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి వచ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే భారత్ పాకిస్థాన్ పర్యటనకు సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ వెళ్లే భారత జట్టుపై భారత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం ఆమోదం తెలపకపోతే జట్టు పాకిస్థాన్‌కు వెళ్లదని, భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు.

అయితే జులై 19 నుంచి 22 వరకు కొలంబోలో జరగనున్న ఐసీసీ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వస్తుందని పూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఐసీసీ సమావేశంలో బీసీసీఐ వర్సెస్ పీసీబీ మధ్య వాడీ వేడీ చర్చ జరగనుంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, బీసీసీఐ కార్యదర్శి జయ్ షా గురువారం కొలంబోకు సమావేశానికి బయలుదేరుతారు. AGM అజెండాలో ఈ అంశంపై ఎటువంటి చర్చ ప్రస్తావన లేనప్పటికీ, ఈ వివాదాస్పద అంశంపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

పాకిస్తాన్ ప్రతిపాదిత షెడ్యూల్..

పాకిస్థాన్ తరపున పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ హాజరవుతారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య జరగనుంది. PCB ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం, భారతదేశం తన మూడు లీగ్ మ్యాచ్‌లను (ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న న్యూజిలాండ్‌తో, మార్చి 1న పాకిస్థాన్‌తో) లాహోర్‌లో ఆడాల్సి ఉంది. మార్చి 5, 6 తేదీల్లో కరాచీ, రావల్పిండిలో సెమీఫైనల్‌లు, మార్చి 9న లాహోర్‌లో ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో ఆడవచ్చు..

అయితే, ఈ టోర్నమెంట్ కోసం భారతదేశం పాకిస్తాన్‌లో పర్యటించకపోతే, ఐసీసీ దానిని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, భారతదేశం తన మ్యాచ్‌లను యూఈఏలో ఆడవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. రేపు జరిగే ఐసీసీ మీటింగ్ కోసం బీసీసీఐ కార్యదర్శి జే షా హాజరు కావచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో రేపు అంటే, శుక్రవారం జరగనున్న భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మహిళల ఆసియా కప్ మ్యాచ్‌ చూసేందుకు జైషా వెళ్తారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories