BWF World Championship: మూడో రౌండ్లో ప్రవేశించిన పీవీ సింధు.. లక్ష్య సేన్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో..

BWF World Championship Updates PV Sindhu Lakshya Sen in Pre Quarters | Sports News Telugu
x

BWF World Championship: మూడో రౌండ్లో ప్రవేశించిన పీవీ సింధు.. లక్ష్య సేన్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో..

Highlights

BWF World Championship: స్లోవేకియా క్రీడాకారిణి మార్టినా రాపిస్కాపై సింధు విజయంతో టోర్నీని ప్రారంభించింది...

BWF World Championship: భారత్ తరఫున రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచిన పీవీ సింధు, యువ స్టార్ లక్ష్యసేన్ బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. స్లోవేకియా క్రీడాకారిణి మార్టినా రాపిస్కాపై సింధు విజయంతో టోర్నీని ప్రారంభించింది. కాగా, లక్ష్య సేన్ కెంటా నిషిమోటోను ఓడించాడు. రైజింగ్ ప్లేయర్ లక్ష్య సేన్ కూడా 22-20, 15-21, 21-18తో జపాన్‌కు చెందిన 15వ సీడ్ కెంటా నషిమోటోను ఓడించి ప్రిక్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించాడు.

పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ కూడా ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. గంటా తొమ్మిది నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 15-21, 21-18, 21-17తో చైనాకు చెందిన లీ షి ఫెంగ్‌పై భారత్‌కు చెందిన 12వ సీడ్ క్రీడాకారుడు విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 43 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో చైనీస్ తైపీకి చెందిన లి క్సీ హువాయ్, యాంగ్ పో సువాన్‌పై 27-25, 21-15తో విజయం సాధించారు.

24 నిమిషాల్లోనే సింధు విజయం..

వరల్డ్ నం.7 సింధు తన అన్ సీడెడ్ ప్రత్యర్థిని కేవలం 24 నిమిషాల్లోనే మట్టికరిపించింది.గత సారి 2019లో టైటిల్ నెగ్గిన ఆరో సీడ్ సింధు శుభారంభం చేసి త్వరగానే 4-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెపిస్కా రెండు పాయింట్లు సాధించడం ద్వారా పునరాగమనం చేసేందుకు ప్రయత్నించింది.. కానీ భారత దిగ్గజం ఆమెకు ముందుకు సాగడానికి అవకాశం ఇవ్వలేదు. విరామం వరకు 11-4 ఆధిక్యంలో ఉంది. దీని తర్వాత కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించి తొలి గేమ్‌ను కేవలం 10 నిమిషాల్లోనే కైవసం చేసుకుంది సింధు.

రెండో గేమ్‌లోనూ అదే కథ పునరావృతమైంది. కేవలం రెండు నిమిషాల్లోనే సింధు 6-0తో ముందంజ వేసింది. ఆమె తన ఆధిపత్య ప్రదర్శనతో విరామ సమయానికి 11-1 ఆధిక్యంలో ఉంది. ఆమె గేమ్, ఆ తర్వాత మ్యాచ్‌ను సులభంగా గెలుచుకుంది. దీనికి విరుద్ధంగా, సేన్ విజయాన్ని నమోదు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే, అతను ఒక గంట 22 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో చివరికి జపాన్‌ను ఓడించగలిగాడు. అయితే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జోడీ సౌరభ్‌ శర్మ-అనుష్క పరీఖ్‌ జోడీని మలేషియాకు చెందిన టాన్‌ కియాన్‌ మెంగ్‌-లాయ్‌ పీ జింగ్‌ 21-8, 21-18తో వరుస గేముల్లో ఓడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories