అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే.. అగ్రస్థానంలో ఎవరంటే?

bumrah to anil kumble these 10 indian bowlers took most wickets in international cricket
x

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే.. అగ్రస్థానంలో ఎవరంటే?

Highlights

టీమిండియా టర్బేనేటర్ హర్భజన్‌ సింగ్‌ ఖాతాలో 707 వికెట్లు చేరాయి. దీంతో ఈ లిస్టులో మూడో స్థానంలో నిలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌ 10 భారత బౌలర్ల జాబితాలోకి టీమిండియా యార్కర్ కింగ్ జస్‌ప్రీత్‌ బుమ్రా ఎంట్రీ ఇచ్చాడు. ఈ పేసర్ కంటే ముందు ఎవరున్నారో ఓసారి చూద్దాం..

ఈ లిస్టులో టీమిండియా మాజీ దిగ్గజం అనిల్‌ కుంబ్లే అగ్రస్థానంలో నిలిచాడు. అతని పేరుతో 953 వికెట్లు ఉన్నాయి.

ఈ లిస్టులో రెండో స్థానంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ నిలిచాడు. ఈ టీమిండియా ఆల్ రౌండర్ తన ఖాతాలో 744 వికెట్లు వేసుకున్నాడు.

టీమిండియా టర్బేనేటర్ హర్భజన్‌ సింగ్‌ ఖాతాలో 707 వికెట్లు చేరాయి. దీంతో ఈ లిస్టులో మూడో స్థానంలో నిలిచాడు.

ఇక ప్రపంచ కప్ అందించిన తొలి కెప్టెన్, టీమిండియా ఆల్ రౌండర్ కపిల్‌ దేవ్‌ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. మొత్తం 687 వికెట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు

ఈ లిస్టులో టీమిండియా మరో పేసర్ జహీర్‌ ఖాన్‌ ఐదో స్థానంలో నిలిచాడు. జహీర్ ఖాతాలో 597 వికెట్లు ఉన్నాయి.

అలాగే, టీమిండియా మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 570 వికెట్లతో ఈ లిస్టులో ఆరో స్థానంలో నిలిచాడు.

టీమిండియా మాజీ పేసర్ జవగళ్‌ శ్రీనాథ్‌ పేరుతో 551 వికెట్లు ఉన్నాయి. ఈ లిస్టులో శ్రీనాథ్ ఏడో స్థానంలో నిలిచాడు.

హైదరాబాదీ పేసర్ మహ్మద్‌ షమీ కూడా ఈ లిస్టులో చేరాడు. ఈ యంగ్ బౌలర్ ఖాతాలో మొత్తం 448 వికెట్లు చేరాయి. ఎనిమిదో స్థానంలో నిలిచాడు

ఇషాంత్‌ శర్మ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ బౌలర్ ఖాతాలో మొత్తం 434 వికెట్లు ఉన్నాయి.

యార్కర్ కింగ్ జస్‌ప్రీత్‌ బుమ్రా మొత్తం 400* వికెట్లతో ఈ లిస్టులో పదవ స్థానంలో నిలిచాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories