Ind Vs Eng 2nd Test: బ్యాటింగ్ లో అదరగొట్టిన భారత బౌలర్లు.. భారత్ 286/8

Bumrah And Shami Built Good Partnership Team India Leads Above 260 Runs in India Vs England 2nd Test
x

షమీ - బుమ్రా (ట్విట్టర్ ఫోటో)

Highlights

Ind Vs Eng 2nd Test: భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత ఆటగాళ్ళు రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ...

Ind Vs Eng 2nd Test: భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత ఆటగాళ్ళు రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ కొద్దిసేపటికే రాబిన్సన్ బౌలింగ్ లో ఇద్దరు వెనువెంటనే అవుట్ అవడంతో బ్యాటింగ్ వచ్చిన బుమ్రా, మహమ్మద్ షమీలు తమ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్స్ కి చుక్కలు చూపిస్తూ భారత అభిమానులను ఆకట్టుకున్నారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ల కంటే ఎక్కువ పరుగులను సాధించిన బుమ్రా, షమీలు అటు బౌలింగ్ లోనే కాకుండా బ్యాటింగ్ లోను తమ సత్తా చాటారు. ఐదో రోజు ఆటలో అద్భుత అర్ధ సెంచరీ తో మహమ్మద్ షమీ కదంతొక్కాడు.

ఐదో రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన మొయిన్ అలీ భారత్ ని 220-240 పరుగుల అధిక్యంలోపు కట్టడి చేస్తేనే రెండో టెస్ట్ గెలిచే అవకాశాలు ఇంగ్లాండ్ కి ఉన్నాయని లేదంటే మ్యాచ్ డ్రా గానే ముగుస్తుందని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం 259 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ ను రెండో టెస్ట్ లో ఎట్టకేలకు ఓటమి నుండి భారత బౌలర్స్ షమీ, బుమ్రా తమ బ్యాటింగ్ తో కాపాడారనే చెప్పాలి. ఆండర్సన్, మార్క్ వుడ్ వంటి బౌలర్ల పదునైన బంతులను సైతం ఎదుర్కొని మంచి స్కోర్ చేయడంతో అభిమానులు కూడా హ్యాపీగా ఉన్నారు.

వాతావరణం అనుకూలించక భారత్ ను ఓటమి నుండి వరుణుడు కరుణిస్తాడెమో ఆశించిన వరుణుడు రూపంలో బుమ్రా, షమీలు 9వ వికెట్ కి 50 పరుగుల భాగసౌమ్యం అందించి భారత్ ని ఆదుకున్నారు. తాజాగా లంచ్ విరామ సమయానికి 259 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్ మహమ్మద్ షమీ 52 , బుమ్రా 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories