WTC Final: టీమిండియా క్రికెటర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన బ్రిటన్

British Government Given Permission to the Indian cricketers to bring their family members
x

టీమిండియా క్రికెటర్లు (ఫొటో ట్విట్టర్)

Highlights

Indian Cricketers: డబ్ల్యూటీసీ ఫైనల్, టెస్ట్ సిరీస్‌లు ఆడేందుకు టీం ఇండియా.. ఇంగ్లాండ్ కు వెళ్లనున్న సంగతి తెలిసిందే.

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్, టెస్ట్ సిరీస్‌లు ఆడేందుకు టీం ఇండియా.. ఇంగ్లాండ్ కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా జూన్ 18న న్యూజిలాండ్ తో డబ్ల్యూటీసీ ఫైనల్ లో తలపడుతుంది. ఆ తరువాత ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్ మొదలుకానుంది. మరోవైపు మహిళల క్రికెట్ టీం కూడా ఇంగ్లండ్ తో టెస్టు, వన్డే సిరీస్ ఆడనుంది. అలాగే హర్మన్ ప్రీత్ నాయకత్వంలో మూడు టీ20లు ఆడనుంది. ఈ సుదీర్ఘ పర్యటనలో టీం ఇండియా ఆటగాళ్లకు బ్రిటన్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఆటగాళ్ల కుటుంబ సభ్యులను ఇంగ్లాండ్ తీసుకెళ్లేందుకు ఓకే చెప్పింది.

ఇప్పటికే పురుషులు, మహిళల జట్ల సభ్యులంతా ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆటగాళ్ల కుటుంబసభ్యులను తీసుకెళ్లేందుకు ఇప్పటికే బీసీసీఐ అనుమతించిన సంగతి విధితమే. తాజాగా బ్రిటన్ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. ఈమేరకు బీసీసీఐ ఎప్పటినుంచో ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఆటగాళ్లు జూన్ 3న ఇంగ్లాండ్ బయలుదేరనున్నారు. సౌథాంప్టన్ చేరుకోగానే అక్కడి హోటళ్లలో 3 రోజుల పాటు కఠిన క్వారంటైన్ లో ఉంటారు. అనంతరం నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories