Sourav Ganguly : ఆస్పత్రి నుంచి దాదా డిశ్చార్జ్..

Sourav Ganguly : ఆస్పత్రి నుంచి దాదా డిశ్చార్జ్..
x
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గురువారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్‌‌ అయ్యారు.

టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గురువారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్‌‌ అయ్యారు. గంగూలీ గుండెపోటుతో శనివారం వుడ్‌ల్యాండ్స్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని తన నివాసంలో ఈరోజు ఉదయం సౌరవ్ గంగూలీ వ్యాయమం చేస్తుండగా అస్వస్థతకి గురై కిందపడిపోయాడు. దాంతో కోల్‌కతాలోని ఉడ్‌లాండ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఎస్‌కేఎం కార్డియాలజిస్టు డాక్టర్‌ సరోజ్‌ మొండల్‌ నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం సౌరవ్ కు కరోనరీ యాంజియోప్లాస్ట్‌ చేయించుకున్న దాదా 6 రోజుల తర్వాత ఇవాళ డిశ్చార్జ్‌ అయ్యారు. తన ఆరోగ్యంగా పూర్తిగా బాగుందని గంగూలీ తెలిపారు. ఈ సందర్భంగా తనకు వైద్యసేవలందించి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం బయటకు వచ్చిన సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ... 'వుడ్‌ల్యాండ్‌ ఆస్పత్రి వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. ఆస్పత్రిలో వైద్యులు జాగ్రత్తగా చూసుకున్నారు. నా జీవితం తిరిగి పొందడానికి వారు సాయపడ్డారు. త్వరలోనే జీవితాన్ని యధాప్రకారంగా కొనసాగించేందుకు, విమానంలో ప్రయాణించడానికి మానసికంగా సిద్ధంగా ఉంటానని ఆశిస్తున్నా' అని అన్నారు. కాగా.. గంగూలీకి మూడు నాలుగు రోజులు విశ్రాంతి అవసరం అన్నారు. దాదా డిశ్ఛార్జ్‌ కావడంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. సౌరవ్ గంగూలీ బుధవారమే డిశార్జి కావాల్సి ఉంది.. మరోరోజు ఆస్పత్రిలో ఉండాలని గంగూలీ భావించారని వుడ్‌ల్యాండ్స్‌ వైద్యులు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories