Pakistan Vs England: ఇండియాను చూసి నేర్చుకోండి.. పాకిస్థాన్ క్యూరేటర్‌పై బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు

Pakistan Vs England: ఇండియాను చూసి నేర్చుకోండి.. పాకిస్థాన్ క్యూరేటర్‌పై బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు
x
Highlights

Pakistan Vs England: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తమ సొంత దేశానికి క్యూరేటర్‌గా వ్యవహరిస్తున్న టోనీ హెమింగ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌కి...

Pakistan Vs England: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తమ సొంత దేశానికి క్యూరేటర్‌గా వ్యవహరిస్తున్న టోనీ హెమింగ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌కి ముందు పిచ్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ మాత్రం తెలియకపోతే ఎలా అని ప్రశ్నించాడు. ఎంతో అనుభవం ఉండి కూడా క్యూరేటర్ పిచ్‌ని మ్యాచ్ కోసం సిద్ధం చేయడంలో దారుణంగా విఫలమయ్యాడని అన్నారు. "మ్యాచ్‌కి ముందు పిచ్‌ని క్యూరేట్ చేయడంలో ఇండియాను చూసి నేర్చుకోండి" అంటూ టోనీకి సూచించారు. ఇండియాలో మ్యాచ్‌కి అనుగుణంగా పిచ్‌ని సిద్ధం చేస్తారని బసిత్ అలీ గుర్తుచేశారు.

ఆస్ట్రేలియాకు చెందిన టోనీ హెమ్మింగ్ ప్రస్తుతం పాక్ క్యూరేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. టోనీకి ఐసిసిలోనూ పనిచేసిన అనుభవం ఉంది. క్యూరేటర్‌గానూ అతడికి అనుభవం ఉంది. ఇదే అంశాన్ని లేవనెత్తుతూ బసిత్ అలీ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రస్తుతం 3 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో పిచ్‌పై స్పిన్ బౌలింగ్ వేసేందుకు స్పిన్నర్లు తలలు పట్టుకున్నారు. ఎంతో నైపుణ్యం, అనుభవం ఉన్న బౌలర్లు కూడా బంతిని స్పిన్ చేయడానికి తిప్పలు పడ్డారు. మ్యాచ్ ఆరంభంలో అలా ఉన్నప్పటికీ.. తరువాత తరువాత పిచ్ సెట్ అవుతుందనుకున్నారు. కానీ మ్యాచ్ ఆద్యంతం అదే పరిస్థితి కొనసాగింది. వికెట్స్ తీసుకోవడంలోనూ స్పిన్నర్స్ చేతులెత్తేశారు. దీంతో ఇదే అవకాశంగా భావించిన ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కూడా భారీగానే పరుగులు రాబట్టుకున్నారు. ఫలితంగా పాకిస్థాన్ ఈ మ్యాచ్ లో 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సరిగ్గా ఇదే అంశం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీకి కోపం తెప్పించింది. అందుకే తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ పాక్ క్యూరేటర్ టోనీపై ఆయన తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు.


పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ 35 ఓవర్లు వేసి 174 పరుగులు సమర్పించుకోవడమే కాదు. మొత్తం ఇన్నింగ్స్‌లో అతడు ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. పాక్ బౌలర్లు సయిమ్ ఆయుబ్, సల్మాన్ అలీ అఘా కూడా భారీ మొత్తంలో పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఇంగ్లండ్ సైడ్ కూడా ఇంచుమించు సేమ్ సీన్ రిపీటయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషిర్ కూడా రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఒకే ఒక్క వికెట్‌తో సరిపెట్టుకున్నాడు. అనుభవజ్ఞుడైన జాక్ లీచ్ కూడా బౌలింగ్‌లో ఇబ్బందులు పడటం కనిపించింది. ముల్తాన్ స్టేడియంలో ఓవైపు పైనుండి ఎండవేడి.. మరోవైపు బౌలర్ల సహనాన్ని పరీక్షించిన పిచ్.. వెరసి బౌలర్లకు చుక్కలు కనిపించాయి. బసిత్ అలీ కోపానికి కూడా అదే కారణమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories