World Record: వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వరుస విజయాలు సాధించి, ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం.
World Record: వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వరుస విజయాలు సాధించి, ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం. న్యూజిలాండ్ ఉమెన్స్ తో జరిగిన వన్డేలో ఆసీస్ ఉమెన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ మ్యాచ్ విజయంతో అత్యధికంగా 22వరుస విజయాలు సాధించిన జట్టుగా సరికొత్త చరిత్రను లిఖించారు. 2003 సీజన్‌లో ఆస్ట్రేలియా మెన్స్ టీం సాధించిన వరుస వన్డే విజయాల రికార్డును.. అదే దేశానికి చెందిన మహిళలు జట్టు బ్రేక్ చేసింది. రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆసీస్ జట్టు వరుసగా 21 వన్డే విజయాలు సాధించింది. అదే ఇప్పటివరకూ వరల్డ్ రికార్డుగా ఉంది. ఈ రికార్డును ఆస్టేలియా ఉమెన్స్ చెరిపేసింది. ఈ సందర్భంగా ఉమెన్స్ టీంకు ఐసీసీ శుభాకాంక్షలు తెలిపింది.
ఆసీస్ మహిళల జట్టు 2017, అక్టోబర్‌లో చివరిసారి వన్డేలో ఓటమి పాలైది. ఆ తర్వాత 2018 మార్చి నుంచి వరుస విజయాలతో చెలరేగిపోతోంది. భారత్‌లో ఆ ఏడాది జరిగిన వన్డే సిరీస్‌ను ఆసీస్ మహిళలు 3-0తో కైవసం చేసుకున్నారు. ఆ తరువాత పాకిస్తాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక ఇలా వరుసగా మూడు వన్డేల సిరీస్‌లను ఆసీస్ మహిళలు సాధించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించారు. ఇది మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్.
𝟮𝟮 𝗻𝗼𝘁 𝗼𝘂𝘁 🌟
— ICC (@ICC) April 4, 2021
Celebrating the @AusWomenCricket team's historic feat.
Australia's world record ODI winning streak from March 12, 2018 to today:
— cricket.com.au (@cricketcomau) April 4, 2021
vs India 3-0
vs Pakistan 3-0
vs New Zealand 3-0
vs England 3-0
vs West Indies 3-0
vs Sri Lanka 3-0
vs New Zealand 3-0
vs New Zealand 1-0@AusWomenCricket | #NZvAUS pic.twitter.com/rcF3ta7Eyl
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire