IND vs AUS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పు..

Australia wins toss and elects to bowl against india check playing XI
x

IND vs AUS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పు..

Highlights

IND vs AUS: ఈరోజు సెయింట్ లూసియాలో ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య టీ20 ప్రపంచకప్‌లో 11వ సూపర్-8 మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

IND vs AUS, T20 World Cup 2024: 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ ట్రోఫీకి భారత్ ఒక్క అడుగు దూరంలో నిలిచింది. టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్.. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌లో విజయం సాధించి టైటిల్‌ను గెలుచుకోవాల్సి వచ్చింది.

ఈరోజు సెయింట్ లూసియాలో ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య టీ20 ప్రపంచకప్‌లో 11వ సూపర్-8 మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియాలో ఎలాంటి మార్పు లేదు. ఆసీస్ జట్టులో ఒక్క మార్పుతో వచ్చింది. అష్టన్ అగర్ స్థానంలో స్టార్క్‌ని ప్లేయింగ్ 11‌లోకి తీసుకున్నారు. సెయింట్ లూసియాలో ఆకాశం మేఘావృతమై ఉంది. అక్యూవెదర్ ప్రకారం, మ్యాచ్ సమయంలో 50 శాతం వర్షం కురుస్తుంది. ఆకాశంలో 85 శాతం మేఘావృతమై ఉంటుంది.

ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఆస్ట్రేలియా, భారత్‌లకు చెరో పాయింట్ దక్కుతుంది. భారత్ 5 పాయింట్లు సాధించి గ్రూప్-1లో అగ్రస్థానంలో నిలవనుంది. అయితే ఆస్ట్రేలియాకు 3 పాయింట్లు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ గెలవాల్సిందే.

ఇరుజట్ల ప్లేయింగ్-11

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా : మిచెల్ మార్ష్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.


Show Full Article
Print Article
Next Story
More Stories