నేను అలానే ఆడతా: రోహిత్‌ శర్మ

నేను అలానే ఆడతా: రోహిత్‌ శర్మ
x
Highlights

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్నఆఖరి టెస్టు రెండో రోజు ఆటలో మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. ఈ మ్యాచ్ లొ...

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్నఆఖరి టెస్టు రెండో రోజు ఆటలో మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. ఈ మ్యాచ్ లొ టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ ఔటైన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు సినీయర్లు. రోహిత్ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఔటైయ్యాడని.. మాజీలు సునీల్‌ గావస్కర్‌, సంజయ్‌మంజ్రేకర్,ఆకాశ్ చోప్రా విమర్శించారు. అది బాధ్యతారాహిత్యమైన షాట్‌ సోషల్ మీడియాలో రోహిత్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రోహిత్ తనపై వస్తున్న విమర్శలకు బదులిచ్చాడు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం రోహిత్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ఆ షాట్‌ ఆడినందుకు పశ్చాత్తాపం లేదని అన్నాడు. గతంలో ఆలా ఆడే బౌండరీలు సాధిచానని చెప్పాడు. బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకు అలాంటి షాట్‌లు ఆడతానని, ఇకపై కూడా కొనసాగిస్తానని తెలిపాడు.

ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. లైయన్‌ తెలివైన బౌలర్‌. కష్టతరమైన బంతుల్ని విసురుతున్నాడు. అయితే అదే టెక్నిక్‌తో గతంలో ఎన్నో సార్లు విజయవంతమయ్యాను. కొన్నిసార్లు బంతి బౌండరీ అవతల పడవచ్చు. మరికొన్ని సార్లు ఔట్ అవ్వొచ్చు. దురదృష్టవశాత్తు ఈ సారి ఔటయ్యాను. అదే ఆటను భవిష‌్యత్తులో కొనసాగిస్తానని రోహిత్ అన్నాడు.

ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. 274/5 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆసీస్ కొనసాగించింది. టిమ్‌ పైన్పైన్ ‌(50; 104 బంతుల్లో 6x4) అర్థ శతకం చేశాడు. టెస్టుల్లో అతనికిది 9వ అర్ధ శతకం. అయితే శార్దుల్‌ ఠాకుర్‌ వేసిన 100వ ఓవర్‌లో స్లిప్‌లో రోహిత్ శర్మ చేతికిచిక్కి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్‌లో కామెరూన్‌ గ్రీన్ కూడా ‌(47; 107 బంతుల్లో 6x4) ఔటయ్యాడు. వీరిద్దరూ‌ ఆరో వికెట్‌కు 111 పరుగులు జోడించారు.స్టార్క్ , లైయన్ బౌండరీలతో విరుచుపడ్డారు.

ఈ నేపథ్యంలోనే బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ ఆదిలోనే ఓపెనర్ శుభ్‌మన్ ‌ గిల్ ‌(7) వికెట్‌ కోల్పోయింది. పాట్ కమిన్స్‌ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌ చేతికి చిక్కాడు. ఆపై రోహిత్శర్మ ‌(44; 74 బంతుల్లో 6x4), ఛెతేశ్వర్‌ పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో అర్ధ శతకానికి చేరువైన హిట్‌మ్యాన్‌ను స్పిన్నర్నా థన్ లైయన్‌ బోల్తా కొట్టించాడు. దీంతో 60 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. వీరద్దరు జోడి 37 బంతుల్లో 2 పరుగులు నమోదైంది. ఈ నేపథ్యంలో వర్షం కురవడంతో మ్యాచ్ రెండో రోజు నిలిపివేస్తు అంపైర్లు ప్రకటించారు. మరో మూడు రోజుల మ్యాచ్ మిగిలివుంది. తొలి ఇన్నింగ్స్ భారత్ 307 పరుగుల వెనుకంజలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories