Australia vs India: హమ్మయ్యా రక్షించారు

Australia vs India: హమ్మయ్యా రక్షించారు
x
Highlights

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు ఫలితం తేలకుండా ముగిసింది.

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు డ్రా ముగిసింది. 407 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్ 334 పరుగలకే పరిమితం అయింది. హనుమ విహారి(23నాటౌట్ 161 బంతుల్లో 4x4), రవిచంద్రన్‌ అశ్విన్‌(39నాటౌట్ 128 బంతుల్లో 7x4) రక్షణాత్మకంగా ఆడడంతో భారత్ ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. వీరిద్దరూ చివరివరకు క్రీజులో పాతుకుపోయి ఆసీస్ బౌలర్ల సహానానికి పరీక్ష పెట్టారు.

అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 98/2తో ఐదో రోజు ఆట కొనసాగించిన భారత్ ఆదిలోనే కెప్టెన్ రహానే (4) ఔటయ్యాడు. లైయన్ బౌలింగ్ లో వైడ్ చేతికి దొరికిపోయాడు. భారత్ 102 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్ ఆసీస్ బౌలర్లు ధాటిగా ఎదుర్కొన్నాడు. పుజారా, పంత్ నాలుగో వికెట్ కు 148పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఔటైన తర్వాత టీమిండియా స్కోరు నెమ్మదించింది. లంచ్ బ్రేక్ తర్వాత దూకుడుగా ఆడుతున్న పంత్‌ లైయన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు యత్నించి కమిన్స్‌ చేతికి చిక్కాడు. దీంతో అతడు తృటిలో శతకం చేజార్చుకున్నాడు. కాసేపటికే హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో అతడు ఔటవ్వడంతో భారత్‌ 272 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది.

తర్వాత విహారి క్రీజులోకి రావడంతో స్కోర్‌ బోర్డు నెమ్మదించింది. అతడు పూర్తిగా డిఫెన్స్‌ ఆడుతున్నాడు. ఆపై క్రీజులోకి వచ్చిన అశ్విన్తో కలిసి విహారి బ్యాటింగ్ చేశాడు. ఆసీస్ బౌలర్లలో లైయన్ రెండు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. హేజిల్ వుడ్ రెండు,కామిన్స్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 338 ఆలౌట్ స్మిత్‌ 131, లబుషేన్‌ 91; జడేజా 4 వికెట్లు.. , భారత్ తొలి ఇన్నింగ్స్ 244 ఆలౌట్ ‌; పుజారా 50, గిల్‌ 50; కమిన్స్‌ 4 వికెట్లుఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 312/6 డిక్లేర్డ్‌; గ్రీన్‌ 84, స్మిత్‌ 81; సైని 2 వికెట్లు, భారత్ సెకండ్ ఇన్నింగ్స్ 334/5 పంత్‌ 97, పుజారా 77; హేజిల్‌వుడ్‌ 2 వికెట్లు తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories