స్మిత్, నైల్ నిలబెట్టారు.. పరిగెడుతున్నారు..

స్మిత్, నైల్ నిలబెట్టారు.. పరిగెడుతున్నారు..
x
Highlights

విండీస్ బౌలింగ్ లో ఇబ్బందులు పడుతున్న ఆసీస్ జట్టును కౌల్టర్‌నైల్‌ ఆదుకున్నాడు. ఆరోవికెట్ పడిన వెంటనే క్రీజులోకి వచ్చిన నైల్ మరో వికెట్ పడకుండా...

విండీస్ బౌలింగ్ లో ఇబ్బందులు పడుతున్న ఆసీస్ జట్టును కౌల్టర్‌నైల్‌ ఆదుకున్నాడు. ఆరోవికెట్ పడిన వెంటనే క్రీజులోకి వచ్చిన నైల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే.. అప్పటికే కుదురుకున్న స్టీవ్‌ స్మిత్‌ కు చక్కని సహకారాన్ని అందిస్తున్నాడు. స్మిత్ కూడా తన అర్థ సెంచరీ సాధించిన తరువాత బ్యాటుకు పని చెప్పాడు. దీంతో ఆసీస్ స్కోర్ బోర్డు వేగం పెరిగింది. 42 ఓవర్లలో 219 పరుగుల తో ఆసీస్ మంచి స్కోరు దిశగా నడుస్తోంది. మొదట్లో ఉన్న ఇబ్బందుల్ని నిదానంగా అధిగమించిన స్మిత్.. నైల్ సహాయంతో గేరు మార్చాడు. ప్రస్తుతం స్మిత్ 62 పరుగులతో.. నైల్ 48 పరుగులతో క్రీజులో ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories