తడబడ్డారు.. కింద పడ్డారు.. పైకి లేచారు.. పరిగెత్తారు.. గౌరవప్రదమైన స్కోరు సాధించారు. ఇదీ వరల్డ్ కప్ పదో మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్...
తడబడ్డారు.. కింద పడ్డారు.. పైకి లేచారు.. పరిగెత్తారు.. గౌరవప్రదమైన స్కోరు సాధించారు. ఇదీ వరల్డ్ కప్ పదో మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ పరిస్థితి. విండీస్ తో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆసీస్ కు వరుస కష్టాలు ఎదురయ్యాయి. విండీస్ బౌలర్ల బౌలింగ్ ను అడ్డుకోవడమే పెద్ద కష్టంగా మారింది వారికి. ఒక్కో పరుగు మాట దేవుడెరుగు.. ఒక్కో వికెట్ జారిపోతూ వచ్చింది. 17ఓవర్లకి ఆసీస్ 79/5తో పీకల్లోతు కష్టాల్లో పడిపోయిన జట్టును స్మిత్ ఆదుకున్నాడు. నిదానంగా.. కంగారు లేకుండా క్రీజులో కుదురుకుని పనిలో పడ్డాడు. అతనికి కారే తోడుగా నిలిచాడు. ఇద్దరూ అర్థ శతాత్కా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తరువాత మళ్ళీ వరుసగా రెండు వికెట్లు పడిపోయాయి. స్మిత్ మాత్రం క్రీజు ను వదల్లేదు. సరిగ్గా ఈ సమయంలో అతనికి నైల్ తోడయ్యాడు. ఇక ఇద్దరూ చకచకా ఇన్నింగ్స్ కి మరమ్మతు మొదలెట్టారు. కుదురుకున్న స్మిత్ బాట్ విదిలించాడు. దూకుడుగా నైల్ విరుచుకు పడ్డాడు. అపప్టి వరకూ ఆసీస్ 200 చేస్తే గొప్ప అనుకున్నారు. కానీ చివరికి 288 పరుగుల స్కోరును సాధించింది. స్మిత్ (73 ) పరుగులకు.. నైల్ వేగంగా చేసిన 92 పరుగులు (60 బంతుల్లో) ఆసీస్ ను మంచి స్థితి లో నిలబెట్టాయి. చక్కని స్కోరు సాధించిన ఆసీస్ 49 ఓవర్లకే..ఆలౌట్ అవడం గమనార్హం.
Agony for Nathan Coulter-Nile!
— Cricket World Cup (@cricketworldcup) June 6, 2019
He misses out on a maiden ODI century, but walks off to a rousing ovation after smashing his previous high score of 34 during his 60-ball 92! 👏 #AUSvWI LIVE ⬇️ https://t.co/riLpupROEA pic.twitter.com/dT1p6k9aJM
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire