WACT 2024 : అంతర్జాతీయ హాకీ పోటీల షెడ్యూల్ మార్పు.. మ్యాచ్‌లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ?

WACT 2024 : అంతర్జాతీయ హాకీ పోటీల షెడ్యూల్ మార్పు..  మ్యాచ్‌లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ?
x
Highlights

Women Asian Hockey Champions Trophy 2024: నేటి నుంచి టోర్నీ అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీ నవంబర్ 11 నుంచి నవంబర్ 20 వరకు జరుగుతుంది.

Women Asian నేటి నుంచి టోర్నీ అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీ నవంబర్ 11 నుంచి నవంబర్ 20 వరకు జరుగుతుంది.Champions Trophy 2024: బీహార్‌లోని చారిత్రక నగరం రాజ్‌గిర్ ఆసియా మహిళల హాకీ ఛాంపియన్‌షిప్ 2024కు ఆతిథ్యం ఇస్తోంది. నేటి నుంచి టోర్నీ అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీ నవంబర్ 11 నుంచి నవంబర్ 20 వరకు జరుగుతుంది. తొలిరోజు షెడ్యూల్లో భాగంగా 3 మ్యాచ్‌లు జరగనున్నాయి. జపాన్-దక్షిణ కొరియా మ్యాచ్ అనంతరం చైనా, థాయ్‌లాండ్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత మలేషియా, భారత్ జట్లు పోటీ పడనున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.45 గంటలకు భారత్, మలేషియా మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌, జపాన్‌ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2.30 నుంచి చైనా, మలేషియా మధ్య మ్యాచ్ జరగనుండగా, భారత్, మలేషియా మధ్య మ్యాచ్ సాయంత్రం 4.45 గంటలకు ప్రారంభమవుతుంది. దీని తర్వాత నవంబర్ 13 న బ్రేక్ డే ఉంటుంది. అంటే మ్యాచ్ ఉండదు.

నవంబర్ 14వ తేదీ గురువారం మధ్యాహ్నం 12.45 గంటలకు దక్షిణ కొరియా, మలేషియా జట్లు తలపడనున్నాయి. 2.30 గంటలకు జపాన్, చైనా మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడో మ్యాచ్‌లో సాయంత్రం 4.45 గంటలకు భారత్, థాయ్‌లాండ్ జట్లు తలపడనున్నాయి.

నవంబర్ 15 న బ్రేక్ డే , ఆపై నవంబర్ 16 నుండి మ్యాచ్‌లు కొనసాగుతాయి. తొలి మ్యాచ్‌లో మలేషియా, జపాన్ జట్లు తలపడనున్నాయి. దీని తర్వాత రెండో మ్యాచ్‌లో దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 4:45 గంటలకు మూడో మ్యాచ్‌లో భారత్, చైనా దేశాలు తలపడనున్నాయి. నవంబర్ 17న మలేషియా వర్సెస్ థాయ్‌లాండ్, చైనా vs సౌత్ కొరియా, ఇండియా vs జపాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. నవంబర్ 18న బ్రేక్ డే ఉంటుంది.

నవంబర్ 19న రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి తొలి సెమీఫైనల్‌ జరగనుంది. రెండో సెమీఫైనల్ 4.45 నుంచి జరుగుతుంది. 20న ఫైనల్ నవంబర్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.45 గంటలకు ప్రారంభమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories