Asia Cup 2020 Postponed: వచ్చే ఏడాదికి ఆసియా కప్ 2020 వాయిదా

Asia Cup 2020 Postponed: వచ్చే ఏడాదికి ఆసియా కప్ 2020 వాయిదా
x
Asia Cup 2020 Postponed Till June 2021
Highlights

Asia Cup 2020 Postponed: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పింది అక్షరాల నిజం అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగాల్సిన ఆసియాకప్ 2020 వచ్చే ఏడాదికి వాయిదా పడింది.

Asia Cup 2020 Postponed: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పింది అక్షరాల నిజం అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగాల్సిన ఆసియాకప్ 2020ను వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధికారిక ప్రకటనను వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఏసీసీ స్పష్టం చేసింది. " ఈ సమయంలో ఆసియాకప్ నిర్వహిస్తే ఆటగాళ్ల ఆరోగ్యంతో పాటు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి.. ఆసియా కప్‌ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని నిర్ణయించాం " అని ఏసీసీ ఎగ్జిక్యూటివ్ అధికారి ఒకరు వెల్లడించారు.

ఇక ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్‌‌ని వచ్చే ఏడాది జూన్‌ లో నిర్వహిస్తామని, అయితే దీనికి గాను పాకిస్థాన్ స్థానంలో శ్రీలంక ఆతిథ్యమివ్వనున్నట్లు (ఏసీసీ) తన ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి 2020 ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ వద్ద ఉన్నాయి. వచ్చే ఏడాదికి ఆసియాకప్ వాయిదా పడినా.. పాక్ ఆతిథ్యం ఇవ్వొచ్చు. కానీ.. కరోనా వైరస్ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆతిథ్య హక్కుల్ని శ్రీలంకకి బదిలీ చేసింది. దాంతో.. 2021లో ఆసియా కప్‌కి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుండగా.. 2022 ఆసియా కప్‌కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇక ఆసియా కప్ రద్దు అయిందని అంతకుముందే సౌరవ్ గంగూలీ బుధవారమే స్పష్టం చేశారు. విక్రాంత్ గుప్తాతో జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో గంగూలీ ఈ విషయాన్నీ స్పష్టం చేశారు. తిరిగి కోహ్లి సేన మైదానంలోకి ఎప్పుడు అడుగు పెడుతుందో స్పష్టం చేయలేమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ సలహాలతోనే ముందుకు వెళ్తామని, ఆటగాళ్ళ భద్రత తమకి ముఖ్యమని గంగూలీ పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories