CM Jagan Review Meeting: స్పందనపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష

AP CM YS Jagan Conducts Review Meeting on Spandana Program With Collectors and SPs
x

స్పందనపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష (ట్విట్టర్ ఫోటో)

Highlights

* ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి * దసరా రోజున ఆసరా పథకం అమలు * జూన్-డిసెంబర్ నెలల్లో అర్హులైన వారికీ పంపిణీ

CM Jagan Review Meeting: ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం జగన్ తెలిపారు. దసరా రోజున ఆసరా పథకం అమలు చేయాలని అధికారులకు సూచించారు. జూన్ నుంచి డిసెంబర్ నెలల్లో అర్హులైన వారందరికీ పంపిణీ చేయాలన్నారు. అక్టోబరు 7 నుంచి 10 రోజుల పాటు ఆసరా పథకంపై అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమం క్లాప్ అక్టోబర్ 1న ప్రారంభం కానుందని వెల్లడించారు. అక్టోబరు 19న జగనన్న తోడు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందించనుంది. అక్టోబరు 26న రైతులకు వైఎస్సార్ సున్నావడ్డీలేని రుణాలు అందించనున్నారు. అదే రోజున ఈ ఏడాదికి రైతు భరోసా రెండో విడత అమలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories