Ambati Rayudu: అంబటి రాయుడికి అరుదైన గౌరవం. రాయుడు ట్రోఫీని అందుకునేలా చేసిన ధోనీ..రాయుడు కొత్త జర్నీ ఏంటంటే..

Ambati Rayudu: అంబటి రాయుడికి అరుదైన గౌరవం. రాయుడు ట్రోఫీని అందుకునేలా చేసిన ధోనీ..రాయుడు కొత్త జర్నీ ఏంటంటే..
x

Ambati Rayudu: అంబటి రాయుడికి అరుదైన గౌరవం. రాయుడు ట్రోఫీని అందుకునేలా చేసిన ధోనీ..రాయుడు కొత్త జర్నీ ఏంటంటే..

Highlights

ముందే ప్రకటించినట్లు ఫైనల్ మ్యాచ్ తర్వాత అంబటి రాయుడు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ..తెలుగు క్రికెటర్ అంబటి రాయుడికి అరుదైన గౌరవం కల్పించాడు.

IPL 2023: ఐపీఎల్ 2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ పై తుది పోరులో సీఎస్కే 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఐపీఎల్ లో ఐదు సార్లు నెగ్గిన టీమ్ గా సీఎస్కే నిలిచింది. ఈ రికార్డ్ ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది. తాజా విజయంతో ముంబై ఇండియన్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ సమం చేసినట్లయింది.

అంబటి రిటైర్మెంట్:

ముందే ప్రకటించినట్లు ఫైనల్ మ్యాచ్ తర్వాత అంబటి రాయుడు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ..తెలుగు క్రికెటర్ అంబటి రాయుడికి అరుదైన గౌరవం కల్పించాడు. ఐపీఎల్ ట్రోఫీని రాయుడు అందుకునేలా చేశాడు. అనంతం రాయుడు గురించి ధోనీ చాలా గొప్పగా చెప్పాడు. తామిద్దరం కలిసి ఇండియా-ఏ తరపున ఆడామని గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు, రాయుడు జట్టులో ఉన్నప్పుడు తానెప్పుడు ఫెయిర్ ప్లే అవార్డు గెలవలేదని ధోనీ అన్నాడు. ఇక ఈ ఐపీఎల్ టైటిల్ ను అంబటి రాయుడికి సీఎస్కే టీమ్ అంకితం ఇచ్చింది. రిటైర్ అవుతున్న రాయుడికి టైటిల్ ను అంకితం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు.

అంబటి ఐపీఎల్ జర్నీ:

ఇక మ్యాచ్ అనంతరం అంబటి మాట్లాడాడు. ముంబై, చెన్నై జట్ల తరఫున ఐపీఎల్లో ఆడటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు. గత 30 ఏళ్లుగా తాను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నాడు. తన మిగతా జీవితం మొత్తం హాయిగా నవ్వగలనని ఆరు ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకున్న అంబటి చెప్పడం విశేషం. ఇక అంబటి రాయుడు తన కెరీర్ లో 203 ఐపీఎల్ మ్యాచులు ఆడి 187 ఇన్నింగ్స్ లో 4348 పరుగులు చేశాడు. ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడకుండా..200పైగా ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన ఏకైక భారత క్రికెటర్ రాయుడు కావడం విశేషం.

అంబటి పొలిటికల్ ఎంట్రీ:

ఐపీఎల్ ఫైనల్స్ లో చెన్నై విజయం సాధించడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రెండు జట్లు అద్భుతంగా పోరాడాయన్న విజయసాయి...తన ట్వీట్ లో అంబటి రాయుడు పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించి..తన జీవితంలో నెక్ట్స్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్న అంబటి రాయుడుకు ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. అంబటి రాయుడు వైసీపీలో చేరతాడని ప్రచారానికి విజయసాయి ట్వీట్ మరింత దన్నుగా నిలిచింది. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు శంకుస్థాపన సందర్భంగా జగన్ చేసిన ప్రసంగాన్ని అంబటి రాయుడు రీట్వీట్ చేశాడు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మీ మీద నమ్మకం ఉంది సార్ అని కామెంట్ చేశాడు. అంతేకాక జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కూడా కలవడంతో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. మరి, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న అంబటి రాజకీయాల్లో నూతన ఇన్నింగ్స్ మొదలు పెడతాడేమో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories