జంపా ట్యాంపరింగ్‌ చేశాడా?

జంపా ట్యాంపరింగ్‌ చేశాడా?
x
Highlights

ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ట్యాంపరింగ్‌కు యత్నించాడా? అతను ప్రతి బంతికి జేబులో చేతులు ఎందుకు పెడ్తున్నాడు? జేబులో ఏముంది.. సాండ్‌ పేపరా? అంటూ...

ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ట్యాంపరింగ్‌కు యత్నించాడా? అతను ప్రతి బంతికి జేబులో చేతులు ఎందుకు పెడ్తున్నాడు? జేబులో ఏముంది.. సాండ్‌ పేపరా? అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆదివారం ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా- ఆసీస్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇక్కడ ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్‌ జంపా ప్రవర్తనపై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. బౌలింగ్ చేస్తున్నప్పుడు జంపా వ్యవహరించిన తీరు అనుమానాస్పందంగా కనిపించింది. అక్కడున్న కెమెరాల్లో వీటికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇండియాతో మ్యాచ్ జరుగుతన్నప్పుడు గ్రౌండ్‌లో ఉన్న జంపా బౌలింగ్ వేస్తున్న సమయంలో పదే పదే చేతులు తన ఫ్యాంట్ పాకెట్లో పెట్టుకున్నాడు. జేబులు పదే పదే తడమడం ఆతర్వాత బంతిని రుద్దడం చేశాడు. దీంతో జంపా ఎందుకలా ప్రవర్తించాడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జంపా తీరు అనుమానాస్పదంగా ఉందని, దీనిపై ఐసీసీ దృష్టిసారించాలని నెటిజన్లు పలువురు అభిప్రాయపడ్డారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories