రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఏబీ డివిలియర్స్‌

రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఏబీ డివిలియర్స్‌
x
AB de Villiers (file photo)
Highlights

ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ లో టీ 20 ప్రపంచ కప్ జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ లో టీ 20 ప్రపంచ కప్ జరగనున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ టోర్నీలో ఆడే విష‌యంపై అలోచిస్తునట్టుగా ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియ‌ర్స్ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పైనే ఉందని, తానూ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుని విజేతగా నిలపడానికి పోరాడతానని ఏబీ డివిలియ‌ర్స్ చెప్పుకొచ్చాడు.

ఇక అ తర్వాత ఈ ఏడాదిలో ఏంచేయాలి అన్న దానిపైన ఆలోచిస్తానని డివిలియ‌ర్స్ వెల్లడించాడు. ఇక డివిలియర్స్‌ 2018 మేలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ తరహా లీగుల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇక కరోనా ప్రభావంతో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ను ఏప్రిల్‌ 15 వరకు వాయిదా వేశారు. అప్పటి వరకు కరోనా ప్రభావం తగ్గితే ఐపీఎల్‌ 13వ సీజన్‌ మొదలుకానుంది.

టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌లో మార్పుల్లేవ్: సీఏ స్పష్టం

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్ కూడా రద్దు అవుతుందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌లో మార్పులు ఉండబోవని, అనుకున్న షెడ్యూల్ ప్రకారమే టీ20 వరల్డ్‌కప్ జరుగుతుందని స్పష్టం చేసింది. అక్టోబరు- నవంబరు నాటికి ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నామని, ఒకవేళ అదే జరిగితే..? షెడ్యూల్ ప్రకారం టీ20 వరల్డ్‌కప్ జరగడం ఖాయమని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories