స్మిత్ వివాదంలో మరో టర్న్ : వైరల్ అవుతోన్న డ్రింక్స్ బ్రేక్ పూర్తి వీడియో
మూడు రోజులుగా ఎక్కడ చూసినా క్రికెట్ అభిమానుల్లో జరుగుతోన్న చర్చ స్టీవ్ స్మిత్. ఆట మధ్యలో బ్యాట్స్‌మెన్ గార్డ్ మార్క్ చెరిపేశారని యావత్ క్రికెట్ లోకం...
మూడు రోజులుగా ఎక్కడ చూసినా క్రికెట్ అభిమానుల్లో జరుగుతోన్న చర్చ స్టీవ్ స్మిత్. ఆట మధ్యలో బ్యాట్స్‌మెన్ గార్డ్ మార్క్ చెరిపేశారని యావత్ క్రికెట్ లోకం అతనిపై దుమ్మెత్తిపోస్తుంది. ఆసీస్ సీనియర్లు, కోచ్‌లు మాత్రం అతన్ని వెనకేసుకొస్తున్నారు. ఇంతకీ స్మిత్ చేసింది తప్పేనా..? నిజంగానే గార్డ్ మార్క్ చెరిపేశాడా..? లేక ఊహించుకుంటున్నదేనా..?
మరో వివాదంలో ఇరుక్కున్న ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ విమర్శలు ఎదుర్కుంటున్నాడు. రిషబ్ పంత్ గార్డ్ మార్క్ చెరిపేసినట్లు వైరల్ అయిన వీడియోతో ఇది క్రికెట్ స్పిరిట్‌కు విరుద్ధమంటూ నెటిజన్ల నుంచి క్రికెటర్ల వరకు అందరూ అతన్ని తప్పుబడుతున్నారు. అతను చేసింది ముమ్మాటికీ తప్పే అని తిట్టిపోస్తున్నారలు.
అయితే ఈ టైమ్‌లో ఇదే వివాదానికి సంబంధించిన మరో వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. భారత్‌తో మూడో టెస్ట్ సందర్భంగా డ్రింక్స్ బ్రేక్‌లో స్టీవ్ స్మిత్ పంత్ గార్డ్ మార్క్‌ను చెరిపేస్తు్న్నట్లు స్టంప్ కెమెరాస్‌లో రికార్డైంది. ఈ వీడియో వైరల్ అవటంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో బాల్ టాంపరింగ్ వివాదంలో సస్పెన్షన్ ఎదుర్కొన్నా మార్పు రాలేదని క్రికెట్ అభిమానులు స్మిత్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే తాజాగా వైరల్ అయిన వీడియో స్మిత్‌పై అభిప్రాయం మార్చింది.
తాజాగా వైరల్ అయిన వీడియోలో డ్రింక్స్ బ్రేక్‌లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని క్లీన్ చేసేందుకు వచ్చారు. బ్రష్‌తో క్రీజును శుభ్రం చేశారు. ఆ తర్వాత క్రీజు మార్కింగ్ చేశారు. ఈ సమయంలోనే అక్కడ గార్డ్ మార్క్ తొలగినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో స్మిత్ తప్పు చేయలేదనే భావన వ్యక్తమవుతోంది.
ఇక స్మిత్ పై వస్తున్న విమర్శలను తప్పుబడుతుంది ఆసీస్ టీమ్. స్మిత్ ప్రతీ మ్యాచ్‌లో వికెట్ల దగ్గరకు వెళ్లటం సహజమని వెనకేసుకొస్తున్నారు. స్మిత్ కూడా ఇదే విదంగా స్పందించారు. అయితే ఇదే సమయంలో మరో వీడియో వైరల్ కావటంతో ఇకనైనా స్మిత్ వివాదం నుంచి బయటపడతారా లేదా చూడాలి మరి.
Wow....full footage of the scuffing controversy. I mean, I won't even take sides, see it and decide for yourselves if your brain allows you obviously.
— Don Mateo (@DonMateo_X13) January 12, 2021
Some people on social media really need to grow up !! pic.twitter.com/kOJSpdI6gp
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire