Asia Cup Super 4: సూపర్ 4 రౌండ్‌కు వేళాయే.. తొలి మ్యాచ్‌లో పాక్, బంగ్లా పోరు.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

1st Super 4 Match Of Asia Cup 2023 Between Pakistan Bangladesh Today check Full Schedule
x

Asia Cup Super 4: సూపర్ 4 రౌండ్‌కు వేళాయే.. తొలి మ్యాచ్‌లో పాక్, బంగ్లా పోరు.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

Highlights

Asia Cup Super 4 Schedule: ఆసియా కప్-2023లో సూపర్-4 దశ తొలి మ్యాచ్ బుధవారం పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో మధ్యాహ్నం 3:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ మధ్యాహ్నం 2:30 గంటలకు జరుగుతుంది.

Pakistan vs Bangladesh: ఆసియా కప్-2023లో సూపర్-4 దశ తొలి మ్యాచ్ బుధవారం పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో మధ్యాహ్నం 3:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ మధ్యాహ్నం 2:30 గంటలకు జరుగుతుంది. టోర్నమెంట్ టాప్ స్కోరర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ఎడమ కాలులో స్నాయువు గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడడంలేదు.

వన్డే ఆసియాకప్‌లో ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో పాకిస్థాన్ 12 గెలుపొందగా, బంగ్లాదేశ్ ఒకటి గెలిచింది. ఈ విజయం 2018 ఆసియా కప్‌లో వచ్చింది.

టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన షకీబ్ బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో సూపర్-4 మ్యాచ్‌కు ముందు గాయపడ్డాడు. అతని ఎడమ కాలి స్నాయువులో గాయం ఉంది. ఇటువంటి పరిస్థితిలో, పరుగులు సాధించే బాధ్యత గత మ్యాచ్‌లో మెహదీ హసన్ మిరాజ్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్‌లపైనే ఉంటుంది.

జట్టులోని ఫాస్ట్ బౌలర్లు రాణిస్తున్నారు. గత మ్యాచ్‌లో ఇదే మైదానంలో ఆఫ్ఘనిస్థాన్‌పై తస్కిన్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. షోరీఫుల్ ఇస్లాం మూడు వికెట్లు తీశాడు.

షాహీన్‌ టాప్‌ వికెట్‌ టేకర్‌, బాబర్‌-ఇఫ్తికర్‌ సెంచరీలతో

పాక్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండూ బలంగానే కనిపిస్తున్నాయి. ఈ టోర్నీలో కెప్టెన్ బాబర్ అజామ్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఇఫ్తికర్ అహ్మద్ సెంచరీలు సాధించారు. అంతే కాదు ఆ జట్టు బౌలర్లు కూడా లయలో ఉన్నారు. ఈ సీజన్‌లో షాహీన్ 6 వికెట్లతో టాప్ టేకర్‌గా నిలవగా, హరీస్ రవూఫ్ 5 వికెట్లతో అతడిని ఫాలో అవుతున్నాడు. నసీమ్ షా నాలుగు వికెట్లు తీశాడు.

రెండు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్-11..

పాకిస్థాన్ : బాబర్ అజామ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్.

బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), మహ్మద్ నయీమ్, తౌహీద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, అనముల్ హక్/లిట్టన్ దాస్, ముష్ఫికర్ రహీమ్ (WK), అఫీఫ్ హుస్సేన్, మెహదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, షోర్ఫుల్ ఇస్లాం, హసన్ రహుస్త్ మహ్మద్/ముస్తఫ్.

ఆసియా కప్ సూపర్-4 స్టేజ్ షెడ్యూల్..

సెప్టెంబర్ 6- పాకిస్థాన్ Vs బంగ్లాదేశ్ (లాహోర్), సాయంత్రం 3 గంటలకు

సెప్టెంబర్ 9- శ్రీలంక Vs బంగ్లాదేశ్ (కొలంబో), సాయంత్రం 3 గంటలకు

సెప్టెంబర్ 10- భారత్ వర్సెస్ పాకిస్థాన్ (కొలంబో), సాయంత్రం 3 గంటలకు

సెప్టెంబర్ 12- భారత్ Vs శ్రీలంక (కొలంబో), సాయంత్రం 3 గంటలకు

సెప్టెంబర్ 14- పాకిస్థాన్ Vs శ్రీలంక (కొలంబో), సాయంత్రం 3 గంటలకు

సెప్టెంబర్ 15- భారత్ Vs బంగ్లాదేశ్ (కొలంబో), సాయంత్రం 3 గంటలకు

సెప్టెంబర్ 17- ఫైనల్ (కొలంబో), సాయంత్రం 3 గంటలకు

Show Full Article
Print Article
Next Story
More Stories