కట్టుకున్న భార్యకు కావాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే.. ఎందుకో చదవండి

కట్టుకున్న భార్యకు కావాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే.. ఎందుకో చదవండి
x
Highlights

ఏ సంబంధం లేకున్నా.. కేవలం తాళి కట్టించుకున్నందుకే అర్థాంగి మనతో కలిసి నడుస్తుంది. మన కష్ట సుఖాలను పంచుకుంటుంది. మనతో రక్తసంబంధం లేకున్నా కేవలం...

ఏ సంబంధం లేకున్నా.. కేవలం తాళి కట్టించుకున్నందుకే అర్థాంగి మనతో కలిసి నడుస్తుంది. మన కష్ట సుఖాలను పంచుకుంటుంది. మనతో రక్తసంబంధం లేకున్నా కేవలం ప్రేమ బంధంతో అక్కున చేర్చుకునేదే అర్థాంగి. తన ఇంటి పేరును విడిచి భర్త ఇంటి పేరును మోసి పరువు, ప్రతిష్టలను కాపాడుతుంది. ఇంటికి దీపం ఇల్లాలు అంటారే కానీ, భర్తే దీపం అనరు. తన ప్రేమనే నూనెగా చేసి, వాత్సల్యాన్ని ఒత్తిగా చేసి మనకు వెలుగునిస్తుంది భార్య. భర్త చనిపోతే ఆ జ్ఞాపకాలతోనే శేష జీవితాన్ని గడిపేస్తుంది. అదే భర్త విషయంలో ఏడాదిలోపే మరో స్త్రీని పెళ్లాడుతున్నాడు. నిజంగా అర్థాంగి మగాడికి దీపం. కరెన్సీ కాగితాల కోసం అర్థాంగిని బలిచేయొద్దు.

మనతో జన్మ, జన్మల బంధంతో ఏడడుగులు నడిచి, మూడు ముళ్లు వేయించుకొని పచ్చని సంసారంలో అర్థాంగి అయి మమతల కోవెలలో దేవత అవుతుంది. ఆ అర్థాంగిని మనం కంటి పాపలా చూసుకోవాలి. ఆ శ్రీమతి మనకు స్వర్ణయుగంను తెచ్చి మన ఇంట సిరుల పంటను పండిస్తుంది. అలాంటి మహిళామణులకు విలువ నివ్వాల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories